Home /News /telangana /

Kishan reddy : అభివృద్ది పేరుతో అప్పుల పాలు చేశాడు.. బూతులు లేకుండా చర్చకు సిద్దం

Kishan reddy : అభివృద్ది పేరుతో అప్పుల పాలు చేశాడు.. బూతులు లేకుండా చర్చకు సిద్దం

kishan reddy file pic

kishan reddy file pic

Kishan reddy : తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది చేశానని చెబుతున్న సీఎం కేసిఆర్ , రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ( kishanreddy Counter attack to cm kcr ) ఇదే అంశంపై అమర వీరుల స్థూపం వద్ద చర్చకు వస్తానని సవాల్ విసిరారు. అయితే కేసిఆర్ బూతులు మాట్లాడకుండా ఉంటానంటే తాను రెఢీ అన్నారు.

ఇంకా చదవండి ...
    వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. సీఎం కేసీఆర్ ఓ ( cm kcr ) వైపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ( kishan reddy ) బండి సంజయ్‌లు ( Bandi sanjay ) ఒకరిపై ఒకరు విరుచుకుపడుతున్నారు. ఇరు పార్టీల సవాళ్ల మీద సవాళ్లు విసురుకోవడంతో పాటు ఒకరినోకరు దూషించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఇరు పార్టీల నేతలు రాజకీయ వైరం కంటే వ్యక్తిగత వైరానికి ఎక్కువగా అవకాశం ఇస్తున్నట్టు కనిపిస్తోంది.

    కాగా సోమవారం మంత్రి మండలి సమావేశం తర్వాత సీఎం కేసిఆర్ కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. ఆయనొక చేతకాని దద్దమ్మ అంటూ తీవ్ర పదజాలాన్ని ఉపయోగించారు. ఆయన రండా రాజకీయాలు చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.కిషన్ రెడ్డికి దమ్ముంటే కేంద్రాన్ని ఒప్పించాలని ఆయన సవాల్ విసిరారు. తెలంగాణ నుండి మంత్రిగా కిషన్ రెడ్డికి కేంద్రంలో కనీసం విలువ లేదని దుయ్యబట్టారు.

    Gadwala : భార్యపై కోపంతో సంవత్సరం కొడుక్కి పురుగుల మందు తాగించిన తండ్రి


    ఈ క్రమంలోనే సీఎం చేసిన వ్యాఖ్యలకు నేడు కిషన్ రెడ్డి కౌంటర్ అటాక్ ( counter attack ) చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ది చేశానని చెబుతున్న సీఎం కేసిఆర్ అప్పుల పాలు చేశారని విమర్శించారు. దీనిపై చర్చించేందుకు తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తాను చర్చకు సిద్దమని అన్నారు. అయితే అందుకు కోసం ఓ కండిషన్ కూడా పెట్టారు. ఆయన వ్యక్తిగత బూతులు మాట్లాడకుండా ప్రజాస్వామ్య బద్దంగా చర్చిస్తానంటే తాను సిద్దంగా ఉన్నానని సవాల్ విసిరారు.

    "కేసీఆర్‌కి నేను అంటే కోపమో, బాధనో అర్ధం కావడం లేదు. చాలా సార్లు కేసీఆర్ అపాయింట్మెంట్ అడిగినా ఇవ్వలేదు. ఎంపీ సంతోష్‌తో మాట్లాడను. అపాయింట్మెంట్ కావాలని అడిగినా ఇవ్వలేదు.'' అని కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజు కూడా తెలంగాణ బిడ్డ కేంద్రమంత్రి అయ్యాడని చూడలేదని, తనను రండా అని మాట్లాడినా బాధలేదని కిషన్ రెడ్డి చెప్పారు. ప్రజలు ఎవరు ఏంటి అనేది నిర్ణయిస్తారన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ నైతికతకు వదిలేస్తున్నానని చెప్పారు.

    Nizamabad : ఆ దేశం వెళుతున్న వారి.. అడ్రస్ ఎందుకు గల్లంతవుతుంది..? వారి పరిస్థితి ఇంతేనా


    ఇక ధాన్యం కొనుగోలుపై రైతులకు భరోసా ఇచ్చేందుకే తాను ప్రెస్‌మీట్ ( press meet ) ద్వారా వివరించానని చెప్పారు. ఇదే విషయమై కేంద్రానికి సంబంధించిన మంత్రితో మాట్లాడి చెప్పానని, ఉన్న బాయిల్డ్ రైస్ కొంటామని చెప్పారని కిషన్ రెడ్డి తెలిపారు. దీనిపై సీఎం కేసిఆర్ రెచ్చిపోయి మాట్లాడరని, ఏదో భూమి బద్దలైనట్టు వ్యవహరించారని వ్యవహరించారు.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: CM KCR, Kishan Reddy, PADDY PROCUREMENT

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు