ఆఫ్ట్రాల్ నువ్వెంతంటే.. నువ్వెంత.. మంత్రి జగదీశ్‌రెడ్డి వర్సెస్ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్

ప్రతీకాత్మక చిత్రం

నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నియంత్రిత పంటల సాగు సమావేశం కాస్త రసాభాసగా మారింది. స్టేజ్ మీదనే.. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాగ్భాణాలు సంధించుకున్నారు. ఒకానొక దశలో.. ఆఫ్ట్రాల్.. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ అనుకునే స్థాయికి చేరుకుంది.

  • Share this:
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియంత్రిత పంటల సాగు విధానంపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నియంత్రిత పంటల సాగు సమావేశం కాస్త రసాభాసగా మారింది. స్టేజ్ మీదనే.. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాగ్భాణాలు సంధించుకున్నారు. ఒకానొక దశలో.. ఆఫ్ట్రాల్.. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ అనుకునే స్థాయికి చేరుకుంది. దేశంలోనే రైతు బాంధవుడు కేసీఆర్ అని, రైతు బంధు, రైతు భీమా, రైతు రుణ మాఫీ ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని జగదీష్ రెడ్డి అన్నారు. దీనిపై ‘మంత్రి చెబుతున్నదంతా అబద్దాలు.. రైతు రుణమాఫీ జరగలేదు’ అంటూ.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైరయ్యారు.

    దీంతో ఒక్కసారిగా సమావేశ మందిరం ఉద్రిక్తంగా మరింది. అసెంబ్లీ సాక్షిగా రికార్డులు చెక్ చేసుకోవాలంటూ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మీరు పీసీసీ అధ్యక్షుడుగా ఉండటం మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకే ఇష్టం లేదని మంత్రి జగదీష్ రెడ్డి అనగా, నువ్వు మంత్రిగా ఉండటం ఈ జిల్లా ప్రజల దురదృష్టం అంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ వ్యాఖ్యానించారు.
    Published by:Narsimha Badhini
    First published: