Home /News /telangana /

MINISTER INDRAKARNREDDY DANCE ON THE OCCASSION OF SEVALAL JAYANATHI VRY ADB

Adilabad : వారితో కలిసి స్టెప్పులు వేసిన మంత్రి.. త్వరలో సేవాలాల్ మందిర నిర్మాణం

గిరిజనులతో కలిసి డాన్స్ చేస్తున్న మంత్రి

గిరిజనులతో కలిసి డాన్స్ చేస్తున్న మంత్రి

Adilabad : బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో అధికారికంగా నిర్వహించిన వేడుకలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఖానాపూర్, ముథోల్ ఎమ్మెల్యేలతో కలిసి నృత్యం చేసి సందడి చేశారు.

ఇంకా చదవండి ...
    సేవాలాల్ 283వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి బంజారా మహిళలు తమ సంప్రదాయ దుస్తులు ధరించి హజరయ్యారు. వేడుకల్లో భాగంగా సంప్రదాయ నృత్యలు చేశారు. స్థానికుల కోరిక మేరకు బంజారా మహిళలతో పాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్, నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ముథోల్ ఎమ్మెల్యే జి. విఠల్ రెడ్డి లతో కలిసి కొద్ది నృత్యం చేశారు. దీంతో మహిళలు మురిసిపోయారు. సభికుల్లోనూ ఉత్సాహం నింపారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కె. విజయలక్ష్మీ తోపాటు పలువురు జిల్లా అధికారులు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. అంతకుముందు సేవాలాల్ మందిర నిర్మాణానికి భూమిపూజ చేశారు.

    అనంతరం జరిగిన కార్యక్రమంలో  మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించాక ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంత్ సేవాలాల్  జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అన్ని జాతులను, వర్గాలను గౌరవిస్తూ వారి సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందించడంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ నిధులు కేటాయిస్తున్నారని అన్నారు.  సేవాలాల్ మందిరం నిర్మాణానికి  50 లక్షల  రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, త్వరలో  మరో  50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఆలయాన్నిఅన్ని హంగులతో నిర్మించాలని సూచించారు.

    Khammam : కొడుకు చనిపోతే.., నేను లేనా... కోడలిపై మామ అరాచకం.. పెళ్లంటూ దాడి..!

    దురలవాట్లకు దూరం వుండి,  మంచి అలవాట్లతో తమ తోటి వారిలో మార్పు తీసుకురావాలనేదే సంత్ సేవాలాల్  కోరిక అని, సేవాలాల్ మహారాజ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే మాట్లాడుతూ ఇలాంటి ఉత్సవాల వలన  వారి వారి సంస్కృతి వెల్లి విరుస్తుందని అన్నారు.  ప్రతి ఒక్కరూ విద్యను అభ్యసించాలని,  చదువుతోనే ముందుకు వెళ్లాలని,  మన సంస్కృతిని కాపాడుకోవాలని,  తద్వారా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.
    ఖానాపూర్  ఎమ్మెల్యే  రేఖా నాయక్   మాట్లాడుతూ  సేవాలాల్ మందిరం  నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన  దేవాదాయ శాఖ మంత్రి పేరు చిరస్థాయి గా నిలిచిపోతుందని  అన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఇఓ సుధీర్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డిఆర్ డిఓ విజయలక్ష్మీ సహా పలువురు  అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Adilabad, Minister indrakaran reddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు