Home /News /telangana /

MINISTER INDRAKARAN REDDY VISITS APPLE FARM IN ASIFABAD SK

తెలంగాణ యాపిల్.. తోటను సందర్శించిన మంత్రి ఇంద్రకరణ్

యాపిల్ తోటలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

యాపిల్ తోటలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి బాలాజీ యాపిల్ తోటను సందర్శించారు. మంత్రి తోట అంతా కలియతిరిగి.. యాపిల్ మొక్కలు, పండ్లను ఆసక్తిగా పరిశీలించారు.

    సిమ్లా యాపిల్..! కాశ్మీర్ యాపిల్..! అవును మనకు తెలిసిన యాపిల్స్ ఇవే. జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి చల్లని ప్రాంతాల్లో మాత్రమే పండే పండు ఇది. కానీ ఇప్పుడు తెలంగాణలోనూ యాపిల్ పండుతోంది. అసిఫాబాద్‌లో ఓ రైతు ప్రయోగాత్మకంగా యాపిల్ తోటను వేసి సక్సెస్ అయ్యాడు. కెరమెరి మండలం ధనోరా గ్రామానికి చెందిన రైతు బాలాజీ యాపిల్‌ని పండించాడు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో సాగుచేస్తున్న బాలాజీ యాపిల్ పంట ఇటీవలే చేతికొచ్చింది. తొలి పంటను సీఎం కేసీఆర్‌కు అందజేసేందుకు రేపు హైదరాబాద్‌లో ప్రగతి భవన్‌కు వెళ్లనున్నాడు బాలాజీ. తమ తోటలో పండిన యాపిల్ పండును సీఎంకు అందించనున్నారు.

    తెలంగాణలో యాపిల్ పండించిన రైతు బాలాజీ పేరు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఈ క్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి బాలాజీ యాపిల్ తోటను సందర్శించారు. మంత్రి తోట అంతా కలియతిరిగి.. యాపిల్ మొక్కలు, పండ్లను ఆసక్తిగా పరిశీలించారు. ఆయనతో మాట్లాడి యాపిల్ సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Apple, CM KCR, Minister indrakaran reddy, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు