MINISTER INDRAKARAN REDDY SAYS THAT THE FESTIVAL SHOULD BE CELEBRATED IN ACCORDANCE WITH THE COVID RULES ADB VB
Christmas Festival: కోవిడ్ నిబంధనలకు లోబడి పండుగను జరుపుకోవాలి.. ఉమ్మడి జిల్లాలో గిఫ్ట్ లను పంపిణీ చేసిన మంత్రి..
బహుమతులు ప్రదానం చేస్తున్న మంత్రి
కోవిడ్ నిబంధనలకు లోబడి పండుగను జరుపుకోవాలని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన క్రిస్ మస్ కానుకల పంపిణీలో మంత్రి పాల్గొన్నారు.
త్యాగం, ప్రేమ గొప్పతనాన్ని మనకు తెలిపిన ఆ యేసు ప్రభువు బోధనలను ప్రతి ఒక్కరు పాటించాలని రాష్ట్ర అటవీ పర్యావరణం న్యాయ దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్ మస్ బహుమతుల పంపిణి కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు మంత్రి కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు పండుగను సంతోషంగా జరుపుకోవాలని నిరుపేదలకు క్రిష్టమస్ గిఫ్ట్ ప్యాక్ లు, బట్టలు పంపిణి చేస్తున్నదని అన్నారు. ఒక్కో నియోజక వర్గానికి వేయి చొప్పున జిల్లాలో మూడు వేల గిఫ్ట్ ప్యాక్ ల పంపిణీతో పాటు విందు భోజనం ఏర్పాటు చేశామని అన్నారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ క్రిస్ట్ మస్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. ప్రపంచమంతా శాంతియుతంగా, ప్రేమ పూర్వకంగా ఉండాలని, ప్రేమను అందరికి పంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ గండ్రత్ ఈశ్వర్, అదనపు కలెక్టర్ పి.రాంబాబు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జిల్లా మైనారిటి సంక్షేమ అధికారి స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన క్రిస్ట్ మస్ కానుకల పంపిణి కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మెన్ రాథోడ్ జనార్ధన్, ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి అంకిత్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని మతాల పండుగలను రాష్ట్ర ప్రభుతం గౌరవిస్తోందని, వారికి పండుగ సందర్భంగా కానుకలను ప్రేమ గౌరవంతో జీవించడమే ప్రధానమని, అన్ని మతాలను గౌరవించాలని అన్నారు. రెండు లక్షలతో ప్రభుత్వ పరంగా మంజూరుచేసి పేద వారికి గిఫ్ట్ ప్యాక్ అందిస్తున్నామని తెలిపారు.
కోటి రూపాయలతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అంతకు ముందు క్రిస్టిమస్ పండుగ సందర్బంగా పిల్లల సమక్షంలో కేక్ ను కట్ చేశారు. అనంతరం పేద క్రై స్తవ కుటుంబాలకు గిఫ్ట్ ప్యాక్ లను ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ జోగు ప్రేమెందర్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, స్థానిక నాయకులు, అధికారులు, పాస్టర్లు, క్రైస్తవులు, తదితరులు పాల్గొన్నారు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.