హోమ్ /వార్తలు /తెలంగాణ /

Tribal schools: పాఠశాలలు, హాస్టళ్ల బాట పట్టిన మంత్రులు.. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం 

Tribal schools: పాఠశాలలు, హాస్టళ్ల బాట పట్టిన మంత్రులు.. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం 

భోజనం చేస్తున్న మంత్రి

భోజనం చేస్తున్న మంత్రి

కోమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలను రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Adilabad, India

  గత కొద్ది రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు (Schools), గురుకులాలు,  కస్తూర్భా పాఠశాలల్లో విద్యార్థులు అస్వస్థతకు గురికావడం… ఆసుపత్రి పాలుకావడం… వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వివిధ కారణాలతో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. మొన్నటికి మొన్న ఇదే జిల్లాలో కాగజ్ మండలంలోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు అస్వస్థకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Allola Indrakaran Reddy) కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

  పాఠశాల (School) అంతటా కలియ తిరిగి విద్యార్థుల యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వంట గది, భోజనశాలను పరిశీలించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో భోజనం చేశారు.  మంత్రి వెంట జిల్లా పరిషత్  చైర్ పర్సన్ కోవ లక్ష్మి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆసిఫాబాద్, సిర్పూర్ శాసన సభ్యులు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ కార్పోరేట్  పాఠశాలలకు ధీటుగా గురుకులాల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

  ఇదిలా ఉంటే విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి హరిత, విద్యాశాఖ సహాయ పథక సంచాలకులు రమేష్, విద్యాశాఖ సంయుక్త సంచాలకులు వెంకట నరసమ్మతో కలిసి నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మిక సందర్శించారు.

  Telangana: ఎన్నికలొస్తేనే కేసీఆర్​కు ప్రజలు గుర్తుకొస్తారు.. అక్కడ పథకాలు వస్తాయి: ఈటల

  అనంతరం లక్ష్మణ్ చందా మండలంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం, లక్ష్మణ్ చాందా ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా వంటగది, సామాగ్రి గది, వసతి గదులను, పరిసరాలను స్వయంగా పరిశీలించారు. సిబ్బందికి తగిన సూచనలు అందించారు. ఇదిలా ఉంటే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Education Minister Sabitha Indra Reddy) శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కాసిపేట ఆదర్శ పాఠశాల, వసతి గృహ భవనం, అలాగే తాండూరు మండల కేంద్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం, వసతి గృహ భవనం, బెల్లంపల్లి పట్టణంలోని జూనియర్ కళాశాల, వసతి గృహ భవనాలను ప్రారంభించనున్నారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Adilabad, Minister indrakaran reddy, Telangana students, Tribes

  ఉత్తమ కథలు