నిర్మల్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో రాష్ట్ర అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తో కలిసి అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశమై వరి కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు.
నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ లో రాష్ట్ర అటవీ పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Minister Allola Indrakaran Reddy).. కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తో కలిసి అధికారులు, రైస్ మిల్లర్లతో సమావేశమై వరి కొనుగోళ్లపై సమీక్ష (Review) నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ 2021-2022 యాసంగి కి సంబంధించిన వరి ధ్యాన్యం కొనుగోళ్ళను (Grain purchases) ఈ నెల 31వ తేదీ లోగా పూర్తి చేయాలని అన్నారు. లక్షా 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం అంచనా కాగా, జిల్లాలోని 10 బాయిల్డ్, 33 రా రైస్ మిల్లులు మొత్తం 43 రైస్ మిల్లులు ఉన్నాయని, 185 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. అందులో 86 కేంద్రాలను ప్రారంభించి ఇప్పటివరకు ఏడు వేల మెట్రిక్ టన్నులు వరిధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు.
వారం లోగా చెల్లింపులు జరిగేలా..
వర్షాలు (Rains) పడే సూచనలు కనపడుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎవరికీ ఏ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని వీలైనంత త్వరగా కొనుగోళ్ళను (Purchases) పూర్తి చేయాలని అన్నారు. ట్రాన్స్పోర్ట్, హమాలీల కొరత లేకుండా చూడాలని అన్నారు. రైతులకు (farmers) వారం లోగా చెల్లింపులు జరిగేలా చూడాలని అన్నారు. అధికారులు ప్రతి రోజు క్షేత్ర స్థాయిలోఉండి, తమ తమ పరిధిలో ఉన్న అన్ని కల్లాలలో వంద శాతం కొనుగోలు పూర్తి చేయాలని పేర్కొన్నారు.
వెంటనే కొనుగోలు చేయాలని..
జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ (District Collector Musharraf Ali Farooqi) మాట్లాడుతూ .. ఈ సారి ధాన్యం కొనుగోలులో (Grain purchases) ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపడుతున్నామని అన్నారు. కొన్ని మండలాల్లో హార్వెస్ట్ పూర్తయిందని, తేమ శాతం ఏమైన మార్పులు వస్తే వెంటనే కొనుగోలు చేయాలని, అవసరమైతే ట్రాక్తర్లు వినియోగించాలని, 86 కేంద్రాలలో ప్రారంభించిన వరి కొనుగోలు (Grain purchases) పది రోజుల్లో పూర్తి చేయాలని అన్నారు. దీనికి సంబంధించి కంట్రోల్ రూమ్ నుండి మానిటర్ చేయడం జరుగుతుందని అన్నారు.
మిల్లర్లు, అధికారులు సహకరించాలని..
అదనపు కలెక్టర్ రెవిన్యూ పి. రాంబాబు మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలు (Grain purchases) పూర్తి చేసేందుకు ట్రాన్స్పోర్ట్, మిల్లర్లు, అధికారులు సహకరించాలని, సమన్వయంతో పనిచేసి గడువులోగా పూర్తి చేసి విజయవంతం చేయాలని అన్నారు. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కె. విజయలక్ష్మి, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.