హోమ్ /వార్తలు /తెలంగాణ /

Indrakaran Reddy : దళిత బంధు పథకం మా ఇష్టం వచ్చినోళ్లకి ఇస్తం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

Indrakaran Reddy : దళిత బంధు పథకం మా ఇష్టం వచ్చినోళ్లకి ఇస్తం : మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

Minister Indrakaran Reddy

Minister Indrakaran Reddy

Indrakaran Reddy: మంత్రికి కోపం వచ్చింది. మహిళలు నిలదీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంపై కూడా ఆయన నోరు పారేసుకున్నారు. ఇంతకీ ఆ మంత్రి ఎవరూ ..? ఏ విషయంలో అంత ఫైర్ అయ్యారో తెలుసా..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Nirmal, India

  (K.Lenin,News18,Adilabad)

  ఉమ్మడి ఆదిలాబాద్Adilabad జిల్లాలోనే ఆయన ఓ సీనియర్ రాజకీయ నాయకుడు. ఢిల్లీ నుండి గల్లీ వరకు అన్ని తెలిసిన వ్యక్తి. సుదీర్ఘ రాజకీయ అనుభవం కూడా ఉన్న ప్రజాప్రతినిధి. ప్రస్తుతం తెలంగాణ(Telangana)రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రి గా కూడా ఉన్నారు. నాలుగు శాఖల బాధ్యతలను చూస్తున్నారు. అయితే ఎందుకో ఒక్కసారిగా ఆయనకు కోపం వచ్చింది. ఆయనకు వచ్చిన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. సదరు మహిళలకు చీరలు ఇచ్చే కార్యక్రమానికి వెళ్లి అసహనం ప్రదర్శించడంతో ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటున్నారు.

  Teenmar Mallanna : పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ డీజీపీకి తీన్మార్ మల్లన్న వరుస ట్వీట్‌లు ..ఏమని చేశారంటే..

  దళిత బంధు అడిగినందుకు ఫైర్ ..

  బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రతిష్టాత్మకంగా ప్రతియేటా నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని ఆడపడుచులు, మహిళలకు పండుగ కానుకగా బతుకమ్మ చీరలను ఉచితంగా పంపిణి చేస్తోంది. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ చీరల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ ,పర్యావరణం ,న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు. చీరల పంపిణి తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసందిస్తుండగా తమకు దళిత బంధు పథకం ఇవ్వడం లేదని పలువురు మహిళలు, నర్సాపూర్ గ్రామస్తులు మంత్రిని నిలదీశారు.

  మంత్రికి కోపం వచ్చింది..

  దళితబంధు పథకం కోసం అందరి ముందు గ్రామస్తులు అడగటంతో మంత్రి ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. గ్రామస్థులపై మండిపడ్డారు. మంత్రి ప్రసంగిస్తూ దళిత బంధు పథకం మా ఇష్టం వచ్చిన వాళ్లకు ఇస్తామంటూ అడిగిన మహిళతో పాటు గ్రామస్తులపై చిరాకు పడ్డారు. అంతటితో వదిలేయకుండా దళిత బంధు వచ్చే వరకు ఓపిక లేకుంటే ఏం చేయలేమని, ఇచ్చింది ఎక్కువైతే ఇలాగే ఉంటుందని ఒక్కసారిగా పది లక్షలు ఇస్తే ఎం చేస్తావో చూపెట్టు అని మహిళను మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎదురు ప్రశ్నించారు. దళిత బంధు అర్హులకు రాలేదని అడిగిన మహిళను బయటకు వెళ్లిపోమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు తీసుకెళ్లాలని సూచించారు.

  OMG :హెడ్‌ మాస్టర్ వల్ల ఫోర్త్ క్లాస్ స్టూడెంట్ మృతి .. ప్రాణానికి లక్ష ఖరీదు కట్టిన గ్రామ పెద్దలు

  బీజేపీ వాళ్లనడిగి తీసుకోండి..

  దళిత బంధు పథకం పేరుతో ఇచ్చే 10లక్షల రూపాయలతో కార్లు, ట్రాక్టర్లు కొనుక్కుంటే అవి భోజనం పెడతాయా అంటూ గ్రామస్తులపై విరుచుకుపడ్డారు. పది లక్షలతో ఏం చేసి బ్రతుకుతారు..? మీకు ఏం అనుభవం ఉంది ..? చెప్తేనే దళితబంధు ఇస్తామని మంత్రి ఖరాకండిగా చెప్పడంతో అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఒకింత ఆగ్రహానికి గురయ్యారు. ఇంత మాట్లాడిన తర్వాత కూడా కొస మెరుపుగా మంత్రి దళిత బంధు మీకు మేమియ్యం... కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ల నుండే తీసుకోమన్నారు. వాళ్లతోనే తిరుగుతున్నారు కాబట్టి దళిత బంధు కూడా వాళ్లనడిగే తెచ్చుకోమనడంతో మహిళలు కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు.

  Viral video : పరిహారం ఇప్పించమని ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్న వృద్ధుడు .. వైరల్ అవుతున్న వీడియో

  అంత కోపమైతే ఎలా సారూ..

  మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం నడుస్తోంది. ఆయన మాట్లాడిన వీడియో తెగ వైరల్ అవుతోంది. బతుకమ్మ పండుగ రోజున మహిళలపై మంత్రి ఇంతటి అసహనాన్ని ప్రదర్శించవచ్చా అనే విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటీవల అర్హులకు దళిత బంధు ఇవ్వాలని మంత్రి క్యాంప్ కార్యాలయంతో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం మంత్రికి మరింత కోపం తెప్పించినట్లు అనుచర వర్గాలుగా తెలిపారు. కారణం ఏదైన మంత్రి స్థానంలో ఉండి ప్రజలతో అలా మాట్లాడి ఉండాల్సింది కాదని రాజకీయ విశ్లేషకులంటున్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Minister indrakaran reddy, Nirmal, Telangana News

  ఉత్తమ కథలు