హోమ్ /వార్తలు /తెలంగాణ /

Women's Day: విమెన్స్‌ డే సందర్బంగా మహిళలకు మంత్రి గిఫ్ట్ .. ఉచిత యోగా శిక్షణ, వైద్య సేవలు

Women's Day: విమెన్స్‌ డే సందర్బంగా మహిళలకు మంత్రి గిఫ్ట్ .. ఉచిత యోగా శిక్షణ, వైద్య సేవలు

Yoga Camp

Yoga Camp

Women's Day:జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఆర్దిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు తన నియోజకవర్గంలో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉచిత యోగా శిక్షణ శిభిరంతో పాటు మంగళవారం మహిళలకు ఉచిత వైద్య సేవల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Siddipet, India

జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ఆర్దిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు (Harishrao)తన నియోజకవర్గంలో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందంటూ రోజూ గంట లేదా ఒక అరగంట యోగా చేయమంటూ మహిళాలకు పిలుపునిచ్చారు. మహిళా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిత్యం ఉచిత మహిళా యోగా శిక్షణ శిబిరానికి సంబంధించిన యూట్యూబ్‌ లింక్‌ను ఆవిష్కరించారు. అలాగే ప్రతి మంగళవారం(Tuesday)మహిళల కోసం వైద్య సేవలు, పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్నిసిద్దిపేట(Siddipet)ఎల్లమ్మ దేవాలయం సమీపంలోని బస్తీ దవఖానాలో ప్రారంభించారు మంత్రి. ఈ కార్యక్రమాన్ని ప్రతి మహిళా సద్వినియోగం చేసుకోవాలని కోరారు హరీష్‌రావు.

యోగాతో సర్వ రోగాలకు చెక్ ..

మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ హెల్త్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ హరీష్‌రావు సిద్దిపేటలో పలు కార్యక్రమాలను ప్రారంభించారు. ముఖ్యంగా యోగా చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందన్న మంత్రి యోగా, ప్రాణామయం ద్వారా 80 శాతం రోగాలు నయం చేసుకోవచ్చని చెప్పారు. సిద్ధిపేట క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఉద్యోగ, ఉపాధ్యాయిని తరుణి, మహిళా అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిత్యం ఉచిత మహిళా యోగ శిక్షణ శిబిర నిర్వహణ కార్యక్రమంలో హాజరై యోగ శిక్షకులు తోట సతీశ్ రూపొందించిన "వ్యాస మహర్షి యోగ - ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించిన యూ ట్యూబ్ లింకు లోగో" ఆవిష్కరించారు.అమెరికా, యూరప్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు సైతం నేర్చుకుని మనదేశ యోగను చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలోని అన్నీ మెడికల్ కళాశాలలోని ఏంబీబీఎస్ విద్యార్థులచే నిత్యం యోగ చేయిస్తున్నామని పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా తన దినచర్య యోగతోనే ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు.

హెల్త్‌ ఈజ్ వెల్త్ ..

అదే విధంగా మహిళా దినోత్సవం సందర్భంగా తన నియోజకవర్గ కేంద్రమైన సిద్ధిపేట ఎల్లమ్మ దేవాలయ సమీపంలోని బస్తీ దవాఖానలో మహిళా ఉచిత వైద్య సేవలు ప్రారంభించారు. ప్రతీ మంగళవారం ప్రత్యేకించి మహిళల కోసం ఈ వైద్య సేవలు, పరీక్షలు నిర్వహించనున్నట్లుగా తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు కోరారు. అవసరమైతే మెడికల్ కళాశాలలకు పంపించి అవసరమైన పెద్ద వైద్యం అందిస్తామని భరోసా ఇచ్చారు.

Hyderabad: నెట్‌వర్క్‌18 నలుగురు మహిళా జర్నలిస్ట్‌లకు హానరింగ్ విమెన్ ఇన్ జర్నలిజం అవార్డులు

సంతాపం ప్రకటన..

మంగళవారం సిద్దిపేట పట్టణంలోని గణేశ్ నగర్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంగళ రాంచంద్రం ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ఈ మేరకు వారి కుటుంబాన్ని మంత్రి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు మంత్రి హరీష్‌రావు.

First published:

Tags: Minister harishrao, Siddipeta, Telangana News, Womens

ఉత్తమ కథలు