కరోనా కష్టాల్లో కేంద్రం చేసిందేం లేదు.. మంత్రి హరీష్ రావు విమర్శలు

కరోనా సోకిన వారు మానసికంగా మనిషి బాధపడుతూ ఉంటారని, శారీరకంగా మంచిగా ఉన్న మనిషి కరోనా రోగం కంటే ఎక్కువ సమాజంలో మనం అనే సూటిపోటీ మాటలకు, చేసే చేష్టలకు ఆ మనిషి మానసికంగా కుంగిపోయి బలహీనపడుతున్నాడని వివరించారు.

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం‌ చేయమని ఎన్ని సార్లు కోరినా కేంద్రం పట్టించు కోలేదని అన్నారు. కరోనా విషయంలోనూ ఏ సాయం చేయలేదని.. ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితి పెంచాలని కోరినా సమాధానం ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు తెలంగాణ ఆర్థిక మంత్రి.

 • Share this:
  తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ విధానం దేశానికే ఆదర్శమన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుల కోసం ఏం చేశారని ఆయన విమర్శించారు. కరోనా పరిస్థితుల్లో‌ కేంద్రం చేసిన సాయం ఏమీ లేదని ధ్వజమెత్తారు. ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితి పెంచాలని కోరినా.. కేంద్రం స్పందించడం లేదన్నారు మంత్రి. మెదక్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి హరీష్ రావు... కాంగ్రెస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతు‌బంధు కోసం‌12 వేల కోట్లు కేటాయిస్తే... రూపాయి కోత పెట్టకుండా 12 వేల‌కోట్లు విడుదల చేశామని చెప్పారు. రైతుల కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ మీద ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు హరీష్ రావు.

  రైతులకు 25 వేల‌రూపాయల రుణాలను ఒకే సారి మాఫీ చేయనున్నాం. ఇందు కోసం‌ ఆర్థిక శాఖ‌1200 కోట్లు విడుదల చేసింది. వ్యవసాయ శాఖ ఈ మొత్తాన్ని దాదపు 5 లక్షల 85 వేల‌మంది రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయనుంది. రైతుల‌ కోసం పని చేస్తున్న సీఎం కేసీఆర్ మీద ఇష్టారీతిన విమర్శలు చేస్తున్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో‌ఏం ఉద్ధరించారో‌ ముందు చెప్పండి. దేశంలో‌ రైతులకు మద్ధతు ధర ఇచ్చి అన్ని పంటలు‌ కొంటున్న ఏకైక‌ రాష్ట్రం తెలంగాణ. రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఒకేే విడతలో చేస్తామని రాహుల్ గాంధీ హమీ ఇచ్చి చత్తీస్‌గఢ్ ప్రజలను మోసం చేశారు. రైతు బంధు, దేశంలో 24 గంటల కరెంట్, రైతులకు బీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం.
  హరీష్ రావు


  అటు కేంద్ర ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు చేశారు హరీష్ రావు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం‌ చేయమని ఎన్ని సార్లు కోరినా కేంద్రం పట్టించు కోలేదని అన్నారు. కరోనా విషయంలోనూ ఏ సాయం చేయలేదని.. ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితి పెంచాలని కోరినా సమాధానం ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు తెలంగాణ ఆర్థిక మంత్రి. ''రాష్ట్రం అప్పులను రీషెడ్యూల్ చేయాలని, మారటోరియం ప్రకటించాలని కోరాం. దీనికి కేంద్రం సమాధానమివ్వలేదు. ఏప్రిల్ నెలలో రూ.2300‌ కోట్ల‌ కోత పెట్టారు. జీఎస్టీ,‌ఐ జీఎస్టీ బకాయిలు ఇవ్వలేదు. ఇవ్వాల్సినవి ఇవ్వకుండా మాపై విమర్శలు చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు ఎవరికీ లేదు.'' అని హరీష్ రావు అన్నారు.

  Published by:Shiva Kumar Addula
  First published: