హోమ్ /వార్తలు /తెలంగాణ /

Harish rao : మంత్రి హరీష్‌ రావుకు కన్నీళ్లు తెప్పించిన ఆ సంఘటన.. ఆ కష్టాలపై ఉద్వేగం..

Harish rao : మంత్రి హరీష్‌ రావుకు కన్నీళ్లు తెప్పించిన ఆ సంఘటన.. ఆ కష్టాలపై ఉద్వేగం..

మాట్లాడుతున్న హరీశ్​ రావు

మాట్లాడుతున్న హరీశ్​ రావు

Harish rao : మంత్రి హరీష్ రావు (Harish rao ) భావోద్వేగానికి గురయ్యారు... ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తాను చూసిన కరోన ( corona ) పరిస్థితులపై కన్నీరు పెట్టుకున్నారు. ఈ క్రమంలో మహిళ పడిన నరకయాతనను ఆయన మీడీయా వారితో పంచుకున్నారు. ఆ మహిళ పడిన కష్టాన్ని వివరించారు.

ఇంకా చదవండి ...

కరోన, ప్రజల జీవితాలను ఆగమ్యగోచరం చేసిన పరిస్థితులను కళ్లకు కట్టినట్టు అనేకమంది చూసాము. ఈ క్రమంలోనే పెళ్లికావల్సిన యువకులు..పిల్లలను సాకాల్సిన తల్లిదండ్రులతో పాటు.. ఒకే ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు చనిపోవడం తోపాటు.. ఉపాధి కోసం పోట్ట చేతపట్టుకుని వచ్చిన అనేకమంది మహిళలు,కూలీలు,  ముఖ్యంగా నిండు గర్భిణిలు వందల కిలోమిటర్లు నడిచి వెళ్లడం.. వారిని కరోనా పేరుతో కనీసం వైద్యులు కూడా దరికి చేరనీయని పరిస్థితులు కోకొల్లలుగా వెలుగు చూశాయి.  వెలుగు చూడని అనేక సంఘటనలకైతే లెక్కేలేదు..ఇలా చెప్పుకుంటూ పోతే కరోనా ఒక విలయమే సృష్టిందని చెప్పవచ్చు..

అయితే ఆ పరిస్థితులను సైతం ప్రభుత్వాలు, నాయకులు, స్వచ్చంధంగా అనేక మంది ప్రవేటు వ్యక్తులు కూడా వారికి సహాయం చేసి అక్కున చేర్చుకున్నారు. తిండి లేని వారికి తిండి పెట్టి, నీడనిచ్చారు.. ఈ క్రమంలోనే ఆనాడు జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసుకుంటూ మంత్రి హరీష్ రావు తన నియోజకవర్గంలో జరిగిన ఓ మహిళ సంఘటనలను గుర్తు చేస్తూ సిద్దిపేట్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఆయన కన్నీరు పెట్టుకున్నారు.

Love story : ఈమె మాములు లవర్ కాదు.. పెళ్లైన మరునాడే, భర్తను రోడ్డుపై పెట్టి టాయ్‌లెట్‌కు వెళ్లింది..తీరా..

ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్‌కు చెందిన ఏడు నెలల గర్భవతి హైదారాబాద్ నుండి వయా తుప్రాన్, మీదుగా రామాయంపేట్‌కు సుమారు 80 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తుంది. ఆమె  ఎక్కువ కిలోమీటర్లు నడవడంతో రక్తస్రావం జరిగింది.. ఈ విషయాన్ని గమనించిన స్థానిక రామాయం పేట్ సీఐ నందీశ్వర్ గౌడ్ ఆ మహిళ బాధను చూసి,  మంత్రి హరీష్‌రావుకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని కోరినట్టు తెలిపారు. దీంతో వెంటనే స్పందించిన మంత్రి వెంటనే మెడికల్ కాలేజి సూపరిండెంట్‌కు ఫోన్ చేసి అంబులెన్స్‌ను పంపించి ఆమెను హుటాహుటిన సిద్దిపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆమె ప్రాణాలు కాపాడినట్టు వెల్లడించారు.


Crime story : కిల్లర్ కిలేడి... ప్రియుడి కోసం, మొత్తం 5గురిని ఖతం చేసింది.. ఎలా అంటే..

కాగా ఈ సంఘటన జరిగిన తర్వాత మధ్యప్రదేశ్ సీఎంఓ కార్యాలయం నుండి తనకు రెండు సార్లు ఫోన్ చేసి మహిళను కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారని ఆ తర్వాత చికిత్స పొందిన మధ్యప్రదేశ్ మహిళను ప్రభుత్వ ఆంబులెన్స్‌లో సురక్షితంగా మధ్యప్రదేశ్‌లోని ఆమె స్వగ్రామానికి తరలించినట్టు చెప్పారు. ఈ సంఘటనను గుర్తు చేసుకుని ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఒక సంధర్భంలో కన్నీరు కార్చారు.

First published:

ఉత్తమ కథలు