కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులే కొట్టుకుపోయాయి.. మంత్రి హరీష్ రావు సెటైర్లు

మంత్రి హరీష్ రావు

కాంగ్రెస్, బీజేపీ నేతలు కొండపోచమ్మ సాగర్‌కు వెళ్లి.. ఆ నీటిని నెత్తిపై చల్లుకోవాలని సెటైర్లు వేశారు మంత్రి హరీష్ రావు. చేసిన తప్పులను ఒప్పుకొని కొండపోచమ్మకు దండం పెట్టుకోవాలని సూచించారు.

 • Share this:
  కొండ పోచమ్మ కాల్వకు గండిపడిన ఘటనపై రాజకీయ దుమారం రేగుతోంది. తెలంగాణలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో విపక్షాలపై మంత్రి హరీష్ రావు ఎదురుదాడికి దిగారు. కొండ పోచమ్మ సాగర్ కాలువ లీకేజీ పై కాంగ్రెస్స్, బీజేపీలు గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. చిన్న కాలువ తెగితే పెద్ద రాద్ధాంతం చేస్తున్నారని..కోడి గుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయంలో ప్రాజెక్టులే కొట్టుకుపోయిన విషయం మరచిపోయి మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు.

  ఎస్సారెస్పీ ఓపెన్ చేసినప్పుడు కూడా కాల్వ తెగిపోయింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సిద్ధ కాకముందే కొట్టుకుపోయింది. దాని నిర్మాణంలో లోపం ఉందని అప్పటి కాంగ్రెస్స్ వారు వదిలేశారు. దేవాదుల ప్రాజెక్ట్ పైపులు పటాకుల లాగా పేలిపోయాయి. అప్పుడు మంత్రులుగా ఉత్తమ్, పొన్నాల ఉన్నారు. గుజరాత్ లోని సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ కాలువలకు కూడా 200 సార్లు గండి పడింది. ఇటీవలే మనోహరాబాద్‌లో కురిసిన వర్షానికి రైల్వే లైన్ తెగి కొట్టుకుపోయింది. దీనికి కారణం ప్రధానమంత్రంటే బీజేపీ నాయకులు ఒప్పుకుంటారా..?
  మంత్రి హరీష్ రావు


  కాంగ్రెస్, బీజేపీ నేతలు కొండపోచమ్మ సాగర్‌కు వెళ్లి.. ఆ నీటిని నెత్తిపై చల్లుకోవాలని సెటైర్లు వేశారు మంత్రి హరీష్ రావు. చేసిన తప్పులను ఒప్పుకొని కొండపోచమ్మకు దండం పెట్టుకోవాలని సూచించారు. విపక్షాలు సలహాలిస్తే స్వీకరిస్తే తీసుకుంటామని.. కానీ బురద జల్లి పోవాలని చూస్తే ఒప్పుకోమని స్పష్టం చేశారు. కొండపోచమ్మ కాల్వ మరమ్మతు పనులు రెండు రోజుల్లో పూర్తవుతాయని.. యథావిధిగా నీరు వస్తాయని స్పష్టం చేశారు.
  First published: