హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Political News: మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..ఆ పార్టీలో చేరితే ఆత్మహత్యే అంటూ..

Telangana Political News: మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు..ఆ పార్టీలో చేరితే ఆత్మహత్యే అంటూ..

మంత్రి హరీష్ రావు

మంత్రి హరీష్ రావు

తెలంగాణ ఆర్ధిక మంత్రి తన్నీరు హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ ఆర్ధిక మంత్రి తన్నీరు హరీష్ రావు (Minister Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీలో చేరితే ఆది ఆత్మహత్యే అని, అలాగే వారి రాజకీయ జీవితం ముగిసినట్టే అని వ్యాఖ్యానించారు. ఖమ్మంలో బీజేపీకి ఎలాంటి అవకాశం ఇక్కడి ప్రజలు ఇవ్వరని మంత్రి  (Minister Harish Rao) పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదని హరీష్ రావు  (Minister Harish Rao) జోస్యం చెప్పారు. బీజేపీ సింగరేణిని అమ్మాలని కుట్రలు పన్నుతోంది. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న బీజేపీ హటావో సింగరేణి బచావో నినాదంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పని చేయాలని సూచించారు.

Hyderabad Biryani: హైదరాబాద్ బిర్యానీనా..మజాకానా..మరో అరుదైన గుర్తింపు..అదేంటంటే?

ఇక మంత్రి హరీష్ రావు  (Minister Harish Rao) వ్యాఖ్యలు ఖమ్మం రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఇటీవల జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చుట్టూ తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ పై పొంగులేటి వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ క్రమంలో పొంగులేటి భద్రతను సర్కార్ తగ్గించింది. ఆయన బీఆర్ఎస్ ను వీడి బీజేపీలోకి చేరబోతున్నారనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో హరీష్ రావు  (Minister Harish Rao) వ్యాఖ్యలు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

BRS-KAVITHA: ఏపీలో ఎమ్మెల్సీ కవిత పర్యటన..బీఆర్ఎస్ లో కీలక బాధ్యతలు అప్పగించనున్నారా?

ఇక అంతకుముందు ప్రజలకు హరీష్ రావు  (Minister Harish Rao) సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంక్రాంతి అందరి కుటుంబాల్లో వెలుగులు నింపాలని మంత్రి కోరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చింది. రైతుబంధు, రైతుభీమా, ఉచిత విద్యుత్, కల్యాణలక్ష్మి వంటి పథకాలు పేదలకు ఆసరాగా నిలిచాయి. రైతుసంక్షేమం  కోసం ప్రభుత్వం నిరంతరం కష్ట పడుతుంది. కరోనా కష్టకాలంలో కూడా రైతుబంధు ఆపలేదు. ఎమ్మెల్యేల జీతాలు ఆపి మరీ కూడా రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్ సర్కార్ దే అన్నారు.

ఈనెల 18న ఖమ్మంలో కేసీఆర్ బహిరంగ సభ సందర్బంగా ఇల్లందులో సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే రేగా కాంతారావు, హరిప్రియనాయక్, ఎమ్మెల్సీ తాత మధు పాల్గొన్నారు.

First published:

Tags: BRS, Harish Rao, Khammam, Telangana

ఉత్తమ కథలు