హోమ్ /వార్తలు /తెలంగాణ /

3 Lakhs for House: తెలంగాణ ప్రజలకు గుడ్​న్యూస్​.. ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి త్వరలో రూ. 3 లక్షలు.. 

3 Lakhs for House: తెలంగాణ ప్రజలకు గుడ్​న్యూస్​.. ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి త్వరలో రూ. 3 లక్షలు.. 

హరీశ్​ రావు (ఫైల్​)

హరీశ్​ రావు (ఫైల్​)

దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు రెండు పడకల ఇళ్లు తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్నామని మంత్రి హరీశ్​ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇళ్లు నిర్మాణం కోసం ఇచ్చే పైసలు బేస్మెంట్ కూడా సరిపోయేవి కావన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Siddipet, India

దేశంలో ఎక్కడా లేని విధంగా నిరుపేదలకు రెండు పడకల ఇళ్లు (Double Bedroom house) తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్నామని మంత్రి హరీశ్​ రావు  (Minister harish rao)అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇళ్లు నిర్మాణం కోసం ఇచ్చే పైసలు బేస్మెంట్ కూడా సరిపోయేవి కావు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైసా ఖర్చు లేకుండా ఇళ్లు కట్టించి తాళం చేతిలో పెట్టి లబ్ధిదారులకు అప్పగిస్తోంది అని మంత్రి అన్నారు. ‘‘అర్హులైన మరింత మంది పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయిస్తా. త్వరలోనే మీ ఇంటి అడుగుజాగలో ఇళ్లు కట్టుకునే వారికి వెసులుబాటు కల్పిస్తూ.. రూ.3 లక్షలు ఆర్థిక సాయం (Financial help) అందిస్తాం. రూపాయి ఖర్చు లేకుండా పైరవీ లేకుండా ప్రతి పేదోడికి ఇళ్లు అందించడమే టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వ లక్ష్యం” అని మంత్రి హరీశ్​ అన్నారు.

అక్కడ కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ఉన్నదా..

సిద్దిపేటలో (Siddipeta) జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..  మండుటెండలో మీ గ్రామ ఊర చెరువు మత్తడి దూకిందని, తెలంగాణలో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతోనేనని మంత్రి వెల్లడించారు.  బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ఉన్నదా.. అంటూ ప్రతి పక్ష నేతల మాట తీరుపై అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ మోదీ ప్రభుత్వం ఉచితాలు వద్దని, 10 లక్షల కోట్లు పారిశ్రామిక వేత్తలకు మాఫీ చేసిందని, కానీ తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వం పేద ప్రజానీకానికి అనేక సంక్షేమ పథకాలు వివరిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉచితాలపై ఎద్దేవా చేయడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దొంగ రాత్రి కరెంటు వచ్చేదని, రైతులు ఎంత తిప్పలు పడ్డారో.. మర్చి పోలేమని హరీశ్​ గుర్తు చేశారు.

త్వరలోనే అర్హులైన అందరికీ కొత్త పెన్షన్లు అందిస్తామని, సీఎం కేసీఆర్ వచ్చాక ఆసరా పెన్షన్లు, నిరంతర ఉచిత కరెంటు, ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేసుకుంటున్నామంటూ.. ఏ పైరవీ చేయకుండానే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మితోనే ఆడపిల్ల పెళ్లి చేసుకుంటున్నారని ప్రభుత్వ సంక్షేమం వివరించారు. కానీ ఢిల్లీ బీజేపీ ఉచితాలు వద్దని, కల్యాణ లక్ష్మీ, రైతుబంధు, రైతుభీమా, ఆసరా పెన్షన్ వద్దని స్వయంగా దేశ ప్రధాని చెప్తుంటే ప్రజలేమవాలనీ నిలదీశారు.

Khammam: అయోమయంలో టీఆర్​ఎస్​.. పాదయాత్ర దిశగా పొంగులేటి.. ఈ ప్రస్థానం ఎందాక..? 

‘‘రైతులకు 24 గంటల ఉచిత రావాల్సిన కరెంటు కేంద్రం కట్ చేసిందని, బాయికాడ మీటర్లు పెడితే 6500 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం ఇస్తామని ఆశ చూపిందని, బాయికాడ మీటరు పెట్టలేదనీ 6500 కోట్లు ఇవాళ రాష్ట్రానికి రావాల్సిన డబ్బును ఇయ్యలేదు”అని మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆదాయం పెంచింది. సీఎం కేసీఆర్. ప్రజల సొమ్మును ధనవంతులకు పంచింది. బీజేపీ అంటూ.. తెలంగాణ సంపద పెంచి పేదలకు పంచితే.. పెరిగిన సంపద బడా కార్పొరేటర్లకు బీజేపీ పంచిందని మంత్రి హరీశ్ విమర్శించారు.తెలంగాణలో కోతలు లేకుండా నాణ్యమైన కరెంటు రైతులకు అందిస్తుంటే కళ్లు మండి కరెంటు తెలంగాణ ప్రజలకు రాకుండా బీజేపీ అడ్డుపడుతున్నదని మంత్రి మండిపడ్డారు.

- బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏ వర్గం బాగుపడ్డదో.. ఏవరికి లాభం జరిగిందో చెప్పాలనీ.., తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకుంటున్నది టిఆర్ఎస్ ప్రభుత్వం. దేశంలో ఏ రాష్ట్రం లో జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది.

First published:

Tags: Harish Rao, House, Siddipeta

ఉత్తమ కథలు