కేసీఆర్ సొంతూరు అభివృద్ధిపై హరీశ్ రావు సమీక్ష

చింతమడక గ్రామంలో ఇళ్ల నిర్మాణ ప్రగతి ఆశించిన వేగంగా జరగకపోవడంపై ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లపై హరీశ్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: July 15, 2020, 7:35 PM IST
కేసీఆర్ సొంతూరు అభివృద్ధిపై హరీశ్ రావు సమీక్ష
కేసీఆర్ సొంతూరు చింతమడక గ్రామ అభివృద్ధిపై మంత్రి హరీశ్ రావు సమీక్ష
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్ సొంత గ్రామం చింతమడకలో వివిధ దశలలో పురోగతిలో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. దసరా నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆయన అన్నారు. చింతమడక గ్రామంలో ఇళ్ల నిర్మాణ ప్రగతి ఆశించిన వేగంగా జరగకపోవడంపై ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లపై హరీశ్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రాయింగ్‌లు పూర్తయిన నిర్మాణ పనులు ఆలస్యం కావడం ఏంటని అధికారులను ప్రశ్నించారు.మ్యాప్స్, లెవెల్స్, లే అవుట్ 3 రోజుల్లో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

ఆర్కిటెక్ట్, ఇంజనీర్‌లు ఇచ్చిన లెవెల్స్ ఆధారంగా ఇండ్ల నిర్మాణం చేయాలని సూచించారు. ఖాళీ చేసిన ఇళ్లను తొలగించాలని ఆదేశించారు. చింతమడకలో డంపింగ్ యార్డ్ పనులు వచ్చే 15 రోజుల్లో, స్మశాన వాటిక పనులు 45 రోజుల్లో పూర్తి చేయాలని హరీశ్ రావు ఆదేశించారు. అంకంపేట, దమ్మ చెరువు, మాచాపూర్, సీతారాంపల్లిలలో నిర్మాణానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కేటాయింపు పూర్తి చేయాలని.. ఇళ్లపై నుంచి వెళ్లే విద్యుత్ తీగలను సరి చేసేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. వివిధ పథకాల సంబంధించిన చెక్కులను లబ్దిదారులకు అందించాలని అధికారులకు మంత్రి సూచించారు.
Published by: Kishore Akkaladevi
First published: July 15, 2020, 7:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading