తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ సారథ్యంలో అన్ని రంగాల్లో దూసుకుపోతోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శమని.. దేశంలో తెలంగాణ మోడల్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి హరీశ్ రావు అన్నారు. రూ. 2,90,396 కోట్లతో తెలగాణ బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లుగా ఉంది. నీటిపారుదల(Irrigation) రంగానికి రూ. 26, 885 కోట్లు కేటాయించారు. విద్యుత్ రంగానికి(Electricity) రూ. 12,757 కోట్ల కేటాయింపులు జరిపారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు(Civil Suppiles) రూ. 3,117 కోట్ల కేటాయింపులు జరిపారు. ఆయిల్ ఫామ్‌కు(Oil Farm) రూ. 1000 కోట్లు కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు(Dalita bandu) పథకానికి రూ. 17,700 కోట్లు కేటాయించారు.
ఇక ఆసరా పెన్షన్లకు(Aasara Pensions) రూ. 12,000 కోట్ల కేటాయింపులు జరిపారు. గిరిజన సంక్షేమం,(Tribal Welfare) ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 15,223 కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమానికి (BC Welfare) రూ. 6,229 కేటాయించారు. కీలకమైన వ్యవసాయ శాఖకు(Agriculture Department) రూ. 26,831 కోట్ల కేటాయించారు. కళ్యాణలక్ష్మి,(Kalyana Lakshmi) షాదీ ముబారక పథకాలకు(Shadi Mubarak) రూ. 3,210 కేటాయించారు.షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ. 36,750 కోట్లు కేటాయించారు. పంచాయతీ రాజ్‌కు(Panchayati Raj) రూ. 31,426 కోట్లు కేటాయించారు. వైద్య, ఆరోగ్య శాఖకు(Health Department) రూ. 12,161 కోట్ల కేటాయింపులు జరిపారు. విద్యారంగానికి(Education Department) రూ. 19,093 కోట్లు కేటాయించారు. ఇక రుణమాఫీ పథకానికి రూ. 6,385 కోట్లు కేటాయించారు. హరితహారం(Harithaharam) పథకానికి రూ. 1,471 కోట్లు కేటాయించారు.
పురపాలక శాఖకు(Municipal Department) రూ. 11,372 కోట్లు కేటాయించగా.. రోడ్లు, భవనాల శాఖకు(Roads and Buildings) రూ. 2,500 కోట్లు కేటాయించారు. పరిశ్రమల శాఖకు(Industries) రూ. 4,037 కోట్లు కేటాయించారు, హోంశాఖకు (Home Department) రూ. 9,599 కోట్లు కేటాయించారు. మహిళా సంక్షేమ శాఖకు రూ. 2131 కోట్లు, మైనార్జీ (Minorty) సంక్షేమానికి రూ. 2,200 కోట్లు కేటాయించారు. బడ్జెటలో రైతు బంధు పథకానికి రూ. 1,575 కోట్లు కేటాయించగా.. రైతు బీమా (Rythu Bhima) పథకానికి రూ. 1,589 కోట్ల కేటాయింపులు జరిపారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్(KCR Nutrition kit) పథకానికి రూ. 200 కోట్ల కేటాయింపులు జరిపారు. పల్లె ప్రగతి,(Palle Pragathi) పట్టణ ప్రగతి(Pattana Pragathi) పథకానికి రూ. 4,834 కోట్లు కేటాయించారు.
BRS Party: ఒక్క సంతకం విలువ రూ.5 లక్షలు.. ఎక్కడో తెలుసా?
BRS MLAs Poaching Case: తెలంగాణ సర్కార్ కు బిగ్ షాక్..!
కీలకమైన డబుల్ బెడ్ రూమ ఇళ్ల (Double Bedroom Scheme) పథకానికి రూ. 12,000 కోట్లు కేటాయించారు. ఆరోగ్యశ్రీ పథకానికి (Aarogya Scheme) రూ. 1,463 కోట్ల కేటాయింపులు జరిపింది. ప్రణాళిక విభాగానికి రూ. 11,495 కోట్లు కేటాయించారు. ఐటీ, కమ్యూనికేషన్ల శఆఖకు రూ. 366 కోట్లు కేటాయించారు. ఉన్నత విద్యాశాఖకు(Higher Education) రూ. 3,001 కోట్లు కేటాయించగా, న్యాయశాఖకు(Legal Department) రూ. 1,665 కోట్లు కేటాయించారు. కొత్తగా నియమించే ఉద్యోగుల జీతభత్యాలకు రూ. 1000 కోట్లు, జర్నలిస్టుల(Journalists) సంక్షేమానికి రూ. 100 కోట్ల కార్పస్ ఫండ్ కేటాయించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana Budget