తెలంగాణ (Telangana)లో రేషన్‌కార్డులు (Ration cards) రద్దయిన పేదలకు తిరిగి మంజూరు కానున్నాయి. రేషన్‌కార్డులు రద్దయినవారిలో అర్హులుంటే గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ముందడుగు వేసింది. ఇందుకోసం ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సర్వే చేపట్టింది. తొలగించిన కార్డుల్లోని చిరునామాల ఆధారంగా గ్రామాలు, పట్టణాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయా కుటుంబాల స్థితిగతులను పరిశీలించి.. అర్హులని తేలితే రేషన్‌కార్డులను పునరుద్ధరి స్తారు (Restore). రేషన్‌కార్డుల రద్దుకు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) ఈ చర్యలు చేపట్టింది. క్షేత్రస్థాయి వెరిఫికేషన్ (Ground level verification) 15 రోజుల కిందటే మొదలైంది. ఈ ప్రక్రియ పూర్తవగానే రేషన్ కార్డులు అందజేయనున్నారు. అయితే తాజాగా మంత్రి హరీశ్‌రావు సైతం కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేశారు.
అరణ్య భవన్లో మంత్రి సమావేశం..
అంతకుముందు హైదరాబాద్‌లో వైద్య సౌకర్యాల కల్పనపై మంత్రి హరీశ్ మాట్లాడారు. మంత్రి హరీశ్ రావు ఆదేశాలతో ఇప్పటికే విజయవాడలోని మంతెన సత్యనారాయణ ప్రకృతి వైద్యశాలను అధికార బృందం అధ్యయనం చేసి వచ్చింది. ఈ నివేదికపై అరణ్య భవన్ లో శనివారం ఆరోగ్య శాఖ మంత్రితో ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి , హెల్త్ డిపార్ట్ మెంట్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి , నేచర్ క్యూర్ హాస్పిటల్ డాక్టర్లు, ఆఫీసర్లు సమావేశమయ్యారు. ప్రకృతి వైద్యానికి హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ మారాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇందుకోసం గాంధీ నేచర్ క్యూర్ ఆసుపత్రిని అన్ని రకాలు అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు కల్పించేందుకు రూ.6 కోట్లు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. వెంటనే టెండర్ ప్రక్రియ చేపట్టి, పనులు మొదలు పెట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
ఈ నేపథ్యంలో రేషన్ కార్డులపై కూడా మంత్రి స్పందించారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు అంతా సిద్ధమైనట్లు ఆగస్టు చివరి వారంలో అందిస్తామని హరీశ్ రావు అన్నారు. అంతేకాదు కొత్త పెన్షన్లపై (Pensions) కూడా మంత్రి స్పందించారు. అవి కూడా ఆగస్టు (August )చివరి వారంలో వచ్చేలా చూస్తామని అన్నారు.
కాగా, తెలంగాణలో చనిపోయిన వారు, ప్రభుత్వ ఉద్యోగం పొందినవారు, ఆధార్ సంఖ్య రెండు సార్లు నమోదైన వారు, గ్రామంలో లేకుండా పూర్తిగా వెళ్లిపోయినవారు, నిబంధనలకు మించి భూములు కలిగిఉన్నవారు తదితర కారణాలతో కార్డులను గతంలో రద్దు చేశారు. అయితే వారికి పలానా కారణంగా కార్డు రద్దు చేస్తున్నామనే నోటీసులు జారీ చేయకపోవడంతో ప్రస్తుతం మళ్లీ విచారించి నోటీసులు జారీ చేయాల్సి వచ్చింది.
అర్హులను ఎలా నిర్ణయిస్తారంటే..?
తెలంగాణ రాష్ట్రంలో గతంలో రద్దయిన రేషన్ లబ్ధిదారులకు నోటీసులు జారీ చేయడం కోసం వారి డేటాను రేషన్‌షాపుల నుంచి సేకరిస్తారు. ఆ జాబితాలను అన్ని రేషన్‌షాపులు (ration shops), గ్రామ పంచాయతీల్లో ప్రదర్శించాలి. రద్దయిన కార్డుదారులకు సంబంధించి తనిఖీ అధికారి సంప్రదించలేని, గుర్తించలేని వారికి నోటీసులను వారి చిరునామాకు పోస్ట్ చేయాలి, ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించాలి. రీవెరిఫికేషన్‌పై స్థానిక ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేయాలి. ఎవరైనా తిరిగి రేషన్‌కార్డు పొందేందుకు అర్హులని తేలితే.. వెంటనే ఆ వివరాలను నమోదు చేయాలి. రద్దు చేయబడిన కార్డు (Ration card)కు సంబంధించిన కారణాలను కూడా నమోదు చేయాలి.
రేషన్ కార్డుతో ఉపయోగాలు..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.