Home /News /telangana /

MINISTER HARISH RAO FIRES ON CENTRAL MINISTER PIYUSH GOEL ON HIS COMMENTS VRY HYD

Harish rao : మంత్రులను పని లేదా..? అంటూ అవమానించడం దారుణం... వెంటనే క్షమాపణ చెప్పాలి...

హరీష్ రావు ఫైల్ ఫోటో

హరీష్ రావు ఫైల్ ఫోటో

Harish rao : ఢిల్లీలో కేంద్రమంత్రి కలిసిన తెలంగాణ మంత్రులపై మీకేం పని లేదా అంటూ వ్యాఖ్యలు చేసిన పియూష్‌ గోయల్ పై మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఆయన తెలంగాణ ప్రజలను అవమానించినందుకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

    వరి వార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సంక్లిష్టంగా మారింది. బీజేపీ , టీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు. ఈ క్రమంలో ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలంటూ ఢిల్లీ వెళ్లిన మంత్రుల బృందం మంగళవారం కేంద్రమంత్రి పియూష్ గోయల్‌ను కలిసి సమావేశమయ్యారు. అయితే మంత్రుల సమావేశంపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

    దీంతో మంత్రి హరీష్ రావు కేంద్రమంత్రి పియూష్ గోయల్ కౌంటర్ అటాక్ చేశారు. మంత్రులను అవమానించిన ఆయన వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రులు వ్యక్తిగత అవసరాల కోసం వెళ్లలేదని రాష్ట్రంలోని 70 లక్షల రైతు కుటుంబాల తరుపున ప్రతినిధులుగా వెళ్లారని అన్నారు.అయితే పియూష్ గోయల్ మాత్రం రాజకీయాలు చేస్తూ తెలంగాణ మంత్రులను అవమానించారిన ఫైర్ అయ్యారు. రాష్ట్రం నుండి ఆరుగురు మంత్రుల బృందం ఢిల్లీకి వెళితే.. వారిని కలవకుండా ముందుగా బీజేపీ నేతలతో సమావేశం అయిన తర్వాత టీఆర్ఎస్ మంత్రులను కలవడం వెనక రాజకీయం ఎవరు చేశారో అర్థమవుతుందని అన్నారు. మంత్రులను అవమానించే హక్కు కేంద్రానికి లేదని ఆయన దుయ్యబట్టారు.

    Gajwel : సీఎం కేసీఆర్ ఫాంహౌజ్‌లో ప్రమాదవశాత్తు వ్యవసాయ కూలి మృతి.. ఆదుకోవాలంటూ కుటుంబ సభ్యుల ఆందోళన


    ఇక కేంద్రం విధించిన 40 ఎల్ఎమ్‌టి ధాన్యాన్ని సేకరణ పూర్తయిందని ,ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 50 ఎల్‌ఎమ్‌టిని సేకరించిందని అన్నారు. తాజాగా యాసంగి పంటను కొనుగోలు చేయమని చెబుతున్న ప్రభుత్వం భవిష్యత్‌తో వానాకాలం పంటను కూడా కొగుగోలు చేయమని చెబితే ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. గతంలో అన్ని ప్రభుత్వాలు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేశాయని, బీజేపీ ప్రభుత్వం మాత్రమే ధాన్యం కొనుగోలు చేయమని చెబుతుందని దుయ్యబట్టారు. ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికో విధానం అవలంభిస్తోందని ఆయన మండిపడ్డారు.

    Breaking : మాజీ సర్పంచ్‌ను హతమార్చిన మావోలు.. పోలీసు ఇన్‌ఫార్మర్ అంటూ లేఖ .. 20న కిడ్నాప్..


    ఓవైపు ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంతో కష్టపడి రైతులను ఆదుకుంటే.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మాత్రం రైతులతో ఆడుకుంటోందని అన్నారు.. నోటి తో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లు చేస్తోందని ఫైర్ అయ్యారు. .బియ్యం రవాణా ఆలస్యం అవుతున్నదని నా దృష్టికి వస్తె నేను ఉమ్మడి జిల్లా మంత్రిగా గతంలో FCI జనరల్ మేనేజర్ ను ఇంటికి పిలిచాను. టిఫిన్ పెట్టి 2 గంటలు బతిమిలాడానని, కలెక్టర్లు, అధికారులు, మిల్లర్లు తమ సమస్యలు చెప్పారు. ఎలాగైనా పైవాళ్ళతో మాట్లాడి బియ్యం తరలించమని కోరాను. కాని ఆయన చెప్పిన దాని ప్రకారం తెలంగాణపై రైల్వే వ్యాగన్లు పంపించకుండా వివక్ష చూపిస్తున్నారని చెప్పినట్టు ఆయన వివరించారు.

    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Harish Rao, PADDY PROCUREMENT, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు