Home /News /telangana /

MINISTER HARISH RAO FIRES ON CENTRAL GOVERNMENT ABOUT SUPPLY OF VACCINE VS MDK

Harish rao : గుజరాత్ ఒక్కటే దేశంలో ఉందా.. వ్యాక్సిన్ పంపిణిపై కేంద్రంపై గుస్సా

వ్యాక్సిన్‌ వినియోగంలో రాష్ట్రంలోనే మన జిల్లా ఫస్ట్

వ్యాక్సిన్‌ వినియోగంలో రాష్ట్రంలోనే మన జిల్లా ఫస్ట్

siddipet :కరోనా వ్యాక్సిన్ల పంపిణిలో కేంద్రం వివక్ష చూపిస్తుందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. అన్ని రాష్ట్రాల ప్రజలను సమంగా చూడాల్సిన ప్రధాని వివక్ష చూపిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

కరోనా వ్యాక్సిన్ల పంపిణిలో కేంద్రం వివక్ష చూపిస్తుందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. అన్ని రాష్ట్రాల ప్రజలను సమంగా చూడాల్సిన ప్రధాని వివక్ష చూపిస్తున్నారని ఆయన మండిపడ్డారు.

తెలంగాణపై కేంద్రం వివక్ష

ఈనేపథ్యంలోనే దేశమంతా కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతుంటే.. కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంపై మాత్రమే ప్రేమ కురిపిస్తున్నదని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. గుజరాత్ రాష్ర్టానికి 1లక్షా 63వేల వ్యాక్సిన్లను పంపిస్తే.., తెలంగాణకు కేవలం 21వేల వ్యాక్సిన్లనే పంపించిందని అన్నారు. తెలంగాణపై ఇంత చిన్నచూపు ఎందుకని ఆయన ప్రశ్నించారు.

ముందు తెలంగాణ ఆ తర్వాతే ఇతర రాష్ట్రాలకు

ఈ సంధర్భంగా తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో లేదా.. తెలంగాణ ప్రజలవి ప్రాణాలు కావా అని ఆయన మండిపడ్డారు. వ్యాక్సిన్ల విషయంలోనూ కేంద్రం వివక్ష చూపించిందని అన్నారు. రెండు ధరల విధానం పెట్టడం సమంజసం కాదని ఆయన ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లో తయారయ్యే వాక్సిన్‌పై కేంద్రం పెత్తనం చేస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణ అంతటికీ వ్యాక్సిన్‌ సరఫరా అయిన తర్వాతనే ఇతర ప్రాంతాలకు తరలించాలని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

వ్యాక్సినేషన్ లో సిద్దిపేట నెం 1

సిద్దిపేటలో కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను సందర్శించిన ఆయన పలు సూచనలు చేశారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్ పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ ఇచ్చి రాష్ట్రంలో మొదటి స్థానంలో సిద్దిపేట నిలిచిందని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేసుకోవలని ఆయన సూచించారు. మరోవైపు జిల్లాలో ఆక్సిజన్ తోపాటు రెమిడెసివర్ ఇంజక్షన్ల కొరత లేదని ఆయన తెలిపారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే కరోనా పేషెంట్లను తిరస్కరించవద్దని, వారిని అడ్మిట్‌ చేసుకోవాలని మంత్రి హరీశ్‌రావు గారు వైద్యులకు సూచించారు. చాలామంది ఇంట్లోనే హోం క్వారంటైన్‌ ఉంటున్నారని, ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికే వస్తే ఆదరించాలని పేర్కొన్నారు. అన్ని వసతులతోపాటు ప్రస్తుతం కొనసాగుతున్నట్లుగానే మంచి భోజనం అందించాలన్నారు.
Published by:yveerash yveerash
First published:

Tags: Covid vaccine, Harish Rao, Siddipet

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు