హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka: బీజేపీ చెప్పేవన్నీ అబద్ధాలే.. అవన్నీ మేమే ఇస్తున్నామన్న హరీశ్ రావు

Dubbaka: బీజేపీ చెప్పేవన్నీ అబద్ధాలే.. అవన్నీ మేమే ఇస్తున్నామన్న హరీశ్ రావు

మంత్రి హరీష్ రావు (ఫైల్ ఫోటో)

మంత్రి హరీష్ రావు (ఫైల్ ఫోటో)

Harish Rao: వెనుకటికి వేయి అబద్దాలు చెప్పైనా పెళ్లి చేయాలని అనే వారని, ఇప్పుడు బీజేపీ వాళ్ళు వేయి అబద్దాలు ఆడైనా ఒక ఎన్నిక గెలవాలని చూస్తున్నారని విమర్శించారు.

  దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో బీజేపీ అన్ని అబద్ధాలే చెబుతోందని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. వెనుకటికి వేయి అబద్దాలు ఆడిన ఒక పెళ్లి చేయాలని అనే వారని, ఇప్పుడు బీజేపీ వాళ్ళు వేయి అబద్దాలు ఆడైన ఒక ఎన్నిక గెలవాలని చూస్తున్నారని విమర్శించారు. గతంలో బీడీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ పుర్రె గుర్తును బహుమతిగా ఇస్తే, బీజేపీ వాళ్ళు 18 శాతం జీఎస్టీని కానుకగా ఇచ్చారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీడీ కార్మికులను మోసం చేస్తే, కేసీఆర్ పెన్షన్ ఇచ్చి వారిని ఆదుకున్నారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కిట్ పథకంలో బీజేపీ ప్రభుత్వ వాటా ఉందని బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని.. కేసీఆర్ కిట్‌లో కేంద్రానిది నయా పైసా లేదని తెలిపారు.

  గొర్రెల యూనిట్లలో 50 వేలు బీజేపీ ప్రభుత్వం ఇస్తుందని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గొర్రెల యూనిట్లలో నూటికి నూరు శాతం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని స్పష్టం చేశారు. చేగుంటలో మంజూరైన ఈఎస్‌ఐ ఆసపత్రిని గజ్వేల్‌కు తరలించారని బీజేపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని.. బీజేపీ నేతలకు నిజంగా దమ్ముంటే చేగుంటకు మంజూరు ఆయునట్లు ఆధారాలు చూపాలని సవాల్‌ విసిరారు. రేషన్ బియ్యంపై కేంద్రం 29 రూపాయలు ఇస్తుంటే, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇస్తోందని ప్రచారం చేస్తున్నారని.. కేంద్రం కేవలం సగం కార్డులకే సబ్సిడీ ఇస్తే మిగతా సగం కార్డులకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని అన్నారు.

  దుబ్బాకలో మంజూరైన పాలిటెక్నిక్ కాలేజ్‌ను సిద్దిపేటకు తరలించారని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని.. అసలు దుబ్బాకకు పాలిటెక్నిక్ కళాశాలనే మంజూరు కాలేదని హరీశ్ రావు వెల్లడించారు. కేసీఆరే బోరు మోటార్లకు మీటర్ పెడుతుందని ఉల్టా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. వరి ధాన్యం మద్దతు ధర కోసం రూ. 5,500 కోట్లు కేంద్రం విడుదల చేసిందని బీజేపీ నేతలు పచ్చి అబద్దాలు ఆడుతున్నారని.. కేంద్రం ఒక్క రూపాయి విడుదల చేయలేదని అన్నారు. ఇటీవల డబ్బులు దొరికిన ఇల్లు మా వాళ్లది కాదంటున్న బీజేపీ అభ్యర్థి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు అని తెలియగానే ప్రచారం ఆపేసి ఎందుకు ఆగమేఘాల మీద పరుగెత్తుకు వచ్చాడని ప్రశ్నించారు. దుబ్బాకలో రఘునందన్ రావు అసత్యాలు ప్రచారం చేసే జూటా స్టార్‌గా మారాడని విమర్శించారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Bjp, Dubbaka By Elections 2020, Harish Rao, Telangana

  ఉత్తమ కథలు