MINISTER HARISH RAO ELECTED AS EXHIBITION SOCIETY PRESIDENT SU
Harish Rao: ఈటల రాజీనామా చేసిన ఆ స్థానంలో హరీష్ రావు..
మంత్రి హరీశ్ రావు(ఫైల్ ఫొటో)
అందరం కలిసి సోసైటీని ముందుకు తీసుకెళ్దామని హరీశ్ రావు చెప్పారు. గత 80 ఏళ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహిస్తున్నదని తెలిపారు.
టీఆర్ఎస్ సర్కార్‌లో ఉన్న సమయంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటల రాజేందర్.. ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్ష పదవిని కూడా వదులుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎగ్జిబిషన్ సొసైటీ యాజమాన్య కమిటీ ప్రకటించింది. అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకుగాను మంత్రి హరీశ్‌ను ఆయన నివాసంలో కలిసిన ఎగ్జిబిషన్ సొసైటీ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. సోసైటీ ప్రగతి పథంలో నడిచేలా కృషి చేస్తానని అన్నారు.
అందరం కలిసి సోసైటీని ముందుకు తీసుకెళ్దామని హరీశ్ రావు చెప్పారు. గత 80 ఏళ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నుమాయిష్‌ను విశ్వవ్యాప్తం చేద్దామని అన్నారు. సొసైటీ విద్యాసంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతున్నదని వెల్లడించారు. వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా చూద్దాం అని తెలిపారు.
ఇక, మాజీ మంత్రి ఈటల రాజేందర్ 2014 నుంచి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా కొనసాగారు. అయితే టీఆర్ఎస్ను వీడిన నేపథ్యంలో ఈటల ఆ పదవికి ఈ ఏడాది జూన్ 15న రాజీనామా చేశారు. అయితే ఈటల రాజీనామా చేసిన కొద్ది రోజులకే.. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడం తీవ్ర కలకలం రేపింది. సొసైటీ లావాదేవీల వ్యవహారంపై అధికారలు ఆరా తీశఆరు. పలు డాక్యుమెంట్లను కూడా సీజ్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. ఎగ్జిబిషన్ సొసైటీ నిధుల విషయంలో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు వచ్చిందని, అందుకనే రికార్డులను పరిశీలిస్తున్నట్లు ఏసీబీ అధికారులు చెప్పారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.