ప్రయాణాలు చేస్తుంటే నిత్యం ఏదో ఓ చోట రోడ్డుపై ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కార్లు, టూవీలర్లపై వెళ్తున్న వాళ్లు అదుపుతప్పి పడిపోవడం, లేదంటే అతివేగంతో యాక్సిడెంట్లకు గురవడం చూస్తుంటాం. రోడ్డుపై వెళ్లే చాలా మంది ఇలాంటివి కంటపడితే ఒకరిద్దరు మినహా ఎవరూ స్పందించరు. ప్రమాదానికి గురైన బాధితుల గురించి పట్టించుకోరు. సాధారణ వ్యక్తులే రోడ్డు ప్రమాదాలను పెద్దగా పట్టించుకోని పరిస్థితులు ఉన్న ఈరోజుల్లో తెలంగాణ ఆర్ధిక, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు(Harish Rao)మాత్రం తన వంతుగా మానవత ధర్మాన్ని పాటించారు. హైదరాబాద్(Hyderabad) నుంచి సిద్దిపేట(Siddipeta)కు మంత్రి కాన్వాయ్ (Convoy)వెళ్తుండగా మార్గం మధ్యలో తిమ్మారెడ్డిపల్లి(Thimmareddypalli)దగ్గర ఓ కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు పడిపోయింది. ప్రమాద సంఘటనను చూసిన మంత్రి తన కాన్వాయ్‌ని ఆపించారు.
మానవత్వాన్ని చాటుకున్న మంత్రి..
ప్రమాదంలో గాయపడిన వాళ్లంతా ఒకే ఫ్యామిలీకి చెందిన వారు కావడంతో వాళ్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏం కాదులే కంగారుపడకండి అంటూ వాళ్లకు ధైర్యం చెబుతూనే వెంటనే గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులు ఆదేశించారు. బాధితులను వేరే కారులో ఆసుపత్రికి తరలించే వరకు ఉండి వారికి భరోసా ఇచ్చారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళలు, పిల్లలు మంత్రి హరీష్‌రావు చూపించిన ఔదార్యం, చెప్పిన మాటలకు షాక్ నుంచి తెరుకున్నారు.
బాధితులకు హరీష్‌రావు భరోసా..
మంత్రి హరీష్‌రావు కాన్వాయ్ దిగి మరీ రోడ్డు ప్రమాద బాధితులను పరిశీలించడం, వారిని పరామర్శించి వైద్యసేవలకు ఆదేశించడంపై బాధితులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు అదే మార్గంలో వెళ్తున్న వాళ్లు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.
మీకే కాదు ఇతరులకు హానీ..
ఇదిలా ఉండే మెదక్ జిల్లాలోనే మరో రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఓ యువకుడు బైక్‌పై విన్యాసాలు చేస్తూ వేగంగా నడుపుతూ ఉన్నాడు. ముందు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళల్ని దూరం నుంచి గమనించకపోవడంతో దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్లను ఢీకొనకుండా షడన్ బ్రేక్ వేయడంతో బైక్‌తో సహా వెళ్లి వాళ్లను ఢీకొట్టాడు. ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం. ఇద్దరు మహిళలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయలో వెనుక నుంచి మరో బైకర్ తీసిన వీడియోని మెదక్ జిల్లా పోలీసులు తమ జిల్లా పోలీస్ డిపార్ట్మెంట్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు.
ప్రతీ ప్రయాణం గమ్యానికి మాత్రమే, ప్రమాదాలకు కాదు, అక్కర్లేని విన్యాసాలతో మీతో పాటు ఇతరులకు హాని కలిగించేలా ఉండకూడదు.#FollowTheTrafficRules#Roadsafety#RoasSafetyMedak#MedakDistrictPolice
@CYBTRAFFIC @TelanganaDGP @TelanganaCOPs @AddlCPTrHyd pic.twitter.com/vCRnwAixEj
— Medak District Police (@spmedak) June 12, 2022
ప్రతి ప్రయాణం గమ్యానికి మాత్రమే ప్రమాదాలకు కాదుని..అలాంటప్పుడు అవసరం లేని విన్యాసాలతో వాహనదారులు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని.అలాగే ఇతరులకు హానీ కలిగించవద్దని సూచిస్తూ మెసేజ్ పెట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.