హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: వచ్చే ఏడాదిలోగా ఆ జిల్లాకు రైలు బండి.. ఆ దిశగా పనులు వేగంగా చేయాలన్న మంత్రి..

Telangana: వచ్చే ఏడాదిలోగా ఆ జిల్లాకు రైలు బండి.. ఆ దిశగా పనులు వేగంగా చేయాలన్న మంత్రి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Telangana: 2022 సంవత్సరం చివరి నాటికి సిద్దిపేట పట్టణానికి రైలు బండి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు. ఆ దిశగా పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు.

  వచ్చే సంవత్సరాంతం (2022 సంవత్సరం చివరి నాటికి)లోగా సిద్దిపేట పట్టణం కు రైలు బండి తీసుకు వస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. ఆ దిశగా రైల్వే, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హల్ లో సిద్దిపేట జిల్లాలో రైల్వే లైన్ ల పనుల పురోగతిపై రైల్వే, రెవెన్యూ అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. సిద్దిపేట జిల్లాలో రైల్వే లైన్ నిర్మాణం కు మొత్తం 759 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటికే 719 ఎకరాల భూ సేకరణ పూర్తి చేశామన్నారు. మిగిలిన 40 ఎకరాల భూ సేకరణ ను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైల్ లైన్ నిర్మాణ పనులు చేపట్టేందుకు వీలుగా రైల్వే అధికారులకు అప్పగించాలని రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. సిద్దిపేట రైల్వే స్టేషన్ బిల్డింగ్ పనులు లాక్ డౌన్ వల్ల ఆగిపోయాయని రైల్వే అధికారులు తెలిపారు.

  లాక్ డౌన్ ముగిసిన వెంటనే పనులు పనులు వేగంగా చేపట్టి పూర్తి చేయాలన్నారు. రూ. 225 కోట్లతో దుద్దేడ నుండి సిద్దిపేట వరకు 17 కిలో మీటర్ల మేర నిర్మించనున్న రైల్వే లైన్ పనుల కు వారం రోజుల్లోగా టెండర్ లు పిలవాలని మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు రైల్వే అధికారులను ఆదేశించారు. గజ్వేల్ నుంచి కొడకొండ్ల వరకు రైల్వే లైన్ నిర్మాణం పూర్తికి ప్రస్తుత సంవత్స రాంతంలోగా పూర్తి చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

  అధికారుల సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్ రావు

  సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, అదనపు కలెక్టర్ ముజ మ్మి ల్ ఖాన్ , సిద్ధిపేట ఆర్డీఓ అనంత రెడ్డి, తహసీల్దార్ శ్రీ విజయ్, దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ శ్రీ సధర్మ రాయుడు, రైల్వే అధికారిక యంత్రాంగం సోమరాజు, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.

  Published by:Veera Babu
  First published:

  Tags: Medak Dist, Minister harishrao, Railways, Sangareddy, Siddipeta, South Central Railway, Train

  ఉత్తమ కథలు