Home /News /telangana /

MINISTER HARISH RAO CRITICIZED ON NITI AAYOG RESPONSE TO TELANGANA CM KCR COMMENTS PRV

Niti Aayog | Harish rao: ‘‘సీఎం గారు ఏం అడిగారు.. మీరు ఏం చెప్తున్నారు?’’ : నీతి ఆయోగ్​పై మంత్రి  హరీశ్​ రావు విమర్శలు

హరీశ్​ రావు (ఫైల్​)

హరీశ్​ రావు (ఫైల్​)

నీతి ఆయోగ్​ సమావేశాన్ని బాయ్​కాట్​ చేస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి నీతి ఆయోగ్.. సీఎం కేసీఆర్​ మాటల్లో వాస్తవం లేదంది. అయితే నీతి ఆయోగ్ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు స్పందించారు .

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    నీతి ఆయోగ్​తో ఎలాంటి ఉపయోగం లేదని,  ఆ సంస్థ మాటలు కేంద్రం బుట్టదాఖలు చేస్తోందని అందుకే ఆ సమావేశాన్ని బాయ్​కాట్​ చేస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి నీతి ఆయోగ్ (Niti aayog)​ కూడా బదులిచ్చింది. సీఎం కేసీఆర్​ మాటల్లో వాస్తవం లేదన్నారు. అయితే నీతి ఆయోగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు  రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీశ్ రావు (Minister harish rao). ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మాట్లాడిన కొద్దిసేపటికే అదరాబాదరగా నీతి ఆయోగ్ స్పందించిందన్నారు. సీఎం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకూ సూటిగా సమాధానం చెప్పకుండా .. రాజకీయంగా నీతి ఆయోగ్ ప్రకటన విడుదల చేసిందని హరీశ్ రావు దుయ్యబట్టారు. తద్వారా నీతి ఆయోగ్ తన విలువను తగ్గించుకుందన్నారు. నీతి ఆయోగ్ స్వతంత్ర ప్రాతిపదికగా వుండాల్సిన సంస్థ అని.. కానీ కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీ పార్టీకి వంత పాడినట్లుగా వుందని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

    కేసీఆర్‌ అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాల్సింది పోయి.. తప్పుడు ప్రకటన చేసిందంటూ హరీశ్​ మండిపడ్డారు. వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించింది. పథకాల అమలు కోసం నీతిఆయోగ్‌ చెప్పినా కేంద్రం నిధులు మంజూరు చేయలేదని, ఇప్పుడేమో నిధులు ఇచ్చినా వాడుకోలేదని నీతిఆయోగ్‌ చెబుతోందని మండిపడ్డారు. రూ.24 వేల కోట్లు ఇవ్వాలని అడిగతే పైసా విదల్చలేదని, ఇక ఆ వ్యవస్థకు ఏం విలువ ఉంది? అని ప్రశ్నించారు. రావాల్సిన నిధులు మంజూరు చేయాలని చాలా సార్లు వేడుకున్నామన్నారు.



    రాష్ట్రాల వాటా 8.60 లక్షల కోట్లు..

    నీతి ఆయోగ్ సిఫార్సులను కేంద్రం చెత్తబుట్టలో వేసిందని, కేంద్రం సెస్‌లను 10 నుంచి 20 శాతానికి పెంచుకుని.. రాష్ట్రాలకు నిధులు తగ్గించారని ఆరోపించారు. సెస్‌ల ద్వారా కేంద్రం 15.47 లక్షల కోట్లు సమకూర్చుకుందని.. అందులో రాష్ట్రాల వాటా 8.60 లక్షల కోట్లు రావాలన్నారు. ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు రాష్ట్రాలకు 29.6 శాతమే ఇస్తోందని దుయ్యాబట్టారు. నీతిఆయోగ్‌ అంకెల గారడి చేస్తోందని హరీశ్‌రావు మండిపడ్డారు. 2015-16లో సీఎస్‌ఎస్‌ ద్వారా రూ.6 వేల కోట్లు వచ్చాయని, 2016-17 రూ.6,695 కోట్లు వచ్చాయని వివరించారు.

    రూ. 2,785 కోట్లు అదనపు భారం..

    ప్రధాన మంత్రి కృషి సంచాయి యోజన అనే పథకంలో 100 శాతం నిధులను గతంలో కేంద్రమే ఇచ్చేదని.. దానిని ఇప్పుడు 60-40 చేసిందని హరీశ్ చెప్పారు. నేషనల్ మిషన్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్‌, ఐసీడీఎస్, ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన, ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన వంటి పథకాలను 60-40 నిష్పత్తిలో నిధులను భరించాలని చెబుతోందని ఆయన మండిపడ్డారు. కేంద్రం చర్యల వల్ల రాష్ట్రం మీద 2,785 కోట్లు అదనపు భారం పడుతుందని హరీశ్ రావు తెలిపారు.

    దేశంలో ఇందిరాగాంధీ, వాజ్‌పేయి, మన్మోహన్‌ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఆర్థిక సంఘం సిఫార్సులను కచ్చితంగా అమలు చేశాయని హరీశ్‌రావు పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు. ప్రగతి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణపై ద్వేషం ఎందుకు..? అంటూ ​ ప్రశ్నించారు హరీశ్. ఆర్థిక సంఘం సిఫారసులను మోదీ ప్రభుత్వం అమలు చేయలేదని, దీనిపై నీతి ఆయోగ్‌ ఎందుకు ప్రశ్నించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: CM KCR, Harish Rao, Niti Aayog, Telangana

    తదుపరి వార్తలు