MINISTER HARISH RAO COUNTER TO CENTRAL MINISTER SHEKHAWAT ON WATER DISPUTE VRY
Harish rao : 4 నెలలు కాదు..7 సంవత్సరాలుగా పెండింగ్.. నీటి వివాదంపై మంత్రి హరీష్ రావు..
హరీష్ రావు ఫైల్ ఫోటో
Harish rao : నీటి వివాదంపై ట్రిబ్యునల్ అంశం.. ఏడు సంవత్సరాలుగా పెండింగ్‌లో పెట్టింది కేంద్ర ప్రభుత్వమే అని మంత్రి హరీష్ రావు ( Harish rao ) స్పష్టం చేశారు.. అంతేకాని, కేంద్రమంత్రి షెకావత్ ( Shekhawat )చెప్పినట్టు నాలుగు నెలలు కాదని ఆయన వివరించారు.
కేంద్ర రాష్ట్రల మధ్య నలుగుతున్న క్రిష్ణాజలాల ( Krishana water dispute) వివాదంపై సీఎం కేసిఆర్ ( cm kcr ) చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి షెకావత్ (Central minister Shekhawat )గురువారం స్పందిచిన విషయం తెలిసిందే.. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇస్తూ.. నేడు మరోసారి మంత్రి హరీష్ రావు కౌంటర్ అటాక్ చేశారు. షేకావత్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకున్నంటున్నారని , నీటి వివాదంలో కేంద్రం వైఖరి సీఎం కేసిఆర్ తప్పుబట్టారని అన్నారు. ఇక వివాదాలకు సంబంధించి అయన పలు విషయాలను వెల్లడించారు.
తెలంగాణ ( Telangana ) ఏర్పడిన నెలన్నరకే కేంద్రానికి నిటివివాదానికి సంబంధించి ట్రిబ్యునల్ వేయాలని కేంద్రానికి వినతి చేశామని చెప్పారు. కాని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన వినతిపై దాదాపు సంవత్సరం పాటు స్పందింకపోవడంతోనే తెలంగాణ రాష్ట్ర హక్కులను సాధించేందుకు సుప్రిం కోర్టుకు వెళ్లామని చెప్పారు. అయితే చట్ట ప్రకారం ధరఖాస్తు చేసిన సంవత్సరం లోగా సమస్యను పరిష్కారం తెలపాలని ఉందని కాని ఆ చట్టాన్ని కేంద్రం ఉల్లంఘించిదని చెప్పారు. మరోవైపు కేంద్రమంత్రి చెబుతున్నట్టు కేసు విత్ డ్రా చేయకున్నా సుప్రిం కోర్టు ఎలాంటీ స్టే ఇవ్వలేదని చెప్పారు. కాని కేంద్రం సుప్రిం కోర్టు కేసును చూపించి తాత్సారం చేస్తుందని చెప్పారు. ఇక కేసు విత్ డ్రా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం 8 నెలల సమయం తీసుకుందన్న వ్యాఖ్యలపై ఆయన సమాధానం చెప్పారు. చట్టపరంగా వచ్చే ఇబ్బందులను అధిగమించేందుకే రాష్ట్రానికి చెందిన న్యాయ కోవిదులను చర్చించేందుకు ఆ సమయం తీసుకున్నామని చెప్పారు. ఒకవేళ సుప్రిం కోర్టులో కేసు విత్ డ్రా చేసుకున్న తర్వాత కేంద్రం పరిష్కారం చూపించకపోతే తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న చట్టపరమైన హక్కులు కొల్పోవలసి రాకుండా ఉండేందుకే ఆ సమయాన్ని తీసుకున్నట్టు వివరించారు.
కాగా ఇదే అంశంపై సీఎం కేసిఆర్ కేంద్రం పై విరుచుకుపడ్డారు. నీటి వివాదం ట్రిబ్యునల్ వేయకుండా ఆలస్యం చేస్తుందని ఫైర్ అయ్యారు. ఏడు సంవత్సరాలుగా కేంద్రం ఎందుకు పెండింగ్‌లో పెడుతుందని ఆయన ప్రశ్నించారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలకు షెకావత్ వివరణ ఇచ్చారు. సీఎం కేసిఆర్ ఈ విషయంలో డ్రామాలు ఆడుతున్నారని అన్నారు. కాగా సుప్రీం కోర్టులో కేసు విత్ డ్రా చేసుకున్న తర్వాత తన వద్దకు వచ్చి కేవలం నాలుగు నెలలే అవుతుందని వివరణ ఇచ్చారు. కాగా సుప్రీం కోర్టులో కేసును విత్ డ్రా చేసుకుంటామని చెప్పి అందుకోసం.. ఎనిమిది నెలల సమయం తీసుకుందని ఆయన అన్నారు. ఆలస్యం చేసింది తెలంగాణ ప్రభుత్వమే అని ఆయన స్సష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.