రాష్ట్ర వైద్యశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రి హరీష్‌రావు (Harish rao ) ఆశాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై పైర్ ( kishanreddy )అయ్యారు. ధాన్యం కొనుగోలులో బాగంగా సీఎం కేసిఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు.
ఈ క్రమంలోనే రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ ( Medical collage) కూడా రాలేదన్న సీఎం వ్యాఖ్యలను ఆయన ఖండించారు. కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం లేకుండా బీబీనగర్ కు ఎయిమ్స్ ఎలా వచ్చిందని చెప్పారు. దానికి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం సరైన భూమిని కేటాయించలేదని ఆయన విమర్శించారు.. ఇక 2016 లో కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంతో మెడికల్ కొత్త కాలేజీల కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు గాని ,మంత్రులు గాని కనీస బాధ్యతగా స్పందించలేదని అని వివరించారు. మెడికల్ కాలేజీల అనుమతులపై సీఎంతో అధికారులు ఎవరైనా కేంద్రంతో చర్చించారా అని ప్రశ్నించారు.
ఇది చదవండి : విద్యార్థులను భయపెడుతున్న కరోనా.. నల్గొండ స్కూళ్లో పాజిటివ్
కాగా కిషన్‌రెడ్డి మెడికల్ కాలేజీలపై అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. బీబీనగర్ ఎయిమ్స్‌కు గత సంవత్సరన్నర క్రితమే 201 ఎకరాల భూమితో పాటు రాష్ట్రప్రభుత్వం నిర్మించిన బిల్డింగ్‌ను సైతం దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్రానికి అందించామని చెప్పారు. కాగా మెడికల్ కాలేజీల కోసం 2015తో పాటు , 2019సంవత్సరంలో కూడా అప్పటి కేంద్రమంత్రులను కలిసి వినతి పత్రాలు అందించారని అందుకు సంబంధించి వారు కూడా లేఖలు అందించారని చెప్పారు. కాగా దేశవ్యాప్తంగా 150 మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇచ్చిన కేంద్రం రాష్ట్రంపై సవతితల్లి ప్రేమను చూపిస్తుందని ఆయన మండిపడ్డారు. ఇక ఏయిమ్స్ ఆసుపత్రి కూడా బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది కాదని, రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచారని, అది రాష్ట్ర ప్రజల హక్కని అన్నారు. నిజంగా కిషన్ రెడ్డికి చిత్తశుద్ది ఉంటే.. మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకురావాలని కోరారు.
ఇది చదవండి : కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 21 సంవత్సరాల యువకులే ముఠా సభ్యులు
ఆయన ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారాన్ని మాట్లాడడంతో పాటు ట్విట్టర్ ద్వారా కూడా పోస్ట్ చేయడం ఆయన బాధ్యతరాహిత్యానికి నిదర్శమని చెప్పారు. ఇప్పటికే తెలంగాణ అభివృద్దిలో పాటుపడితే ప్రజలు గుర్తుంచుకుంటారు కాని అబద్దపు ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదని హితవు పలికారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Harish Rao, Hyderabad, Kishan Reddy