Home /News /telangana /

MINISTER HARISH RAO COMMENTS ON BALAKRISHNA AT BASAVATARAKAM INDO AMERICAN CANCER HOSPITAL SB

Balakrishna: చూడటానికి అలా కనిపిస్తారు కానీ.. బాలయ్యపై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు.

బాలకృష్ణపై కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీశ్ రావు. ఆయన చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా అక్కడ నవ్వులు పూసాయి. ఎన్టీఆర్ అంటే కేసీఆర్‌కు ఎనలేని అభిమానం అన్నారు హరీశ్ రావు.

  ఎన్టీఆర్, బాలయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి హరీశ్ రావు. నిస్వార్థంగా సేవలు అందిస్తున్న ఆస్పత్రుల్లో బసవతారకం ఒకటని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు ప్రశంసించారు. ఆరోగ్యశ్రీతో భారీగా నిధులు డ్రా చేసిన ఆస్పత్రి బసవతారకమని కొనియాడారు. క్యాన్సర్‌ని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యమని తెలిపారు. హైదరాబాద్​లో జరిగిన ఆస్పత్రి 22వ వార్షికోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్ రావు... ఎన్టీఆర్ అన్నా, బసవతారకం ఆస్పత్రి అన్నా ముఖ్యమంత్రి కేసీఆర్​కి ఎనలేని అభిమానమని పేర్కొన్నారు.

  ఇక బాలకృష్ణపై కూడా చూడటానికి కరుకుగా కనిపించినా.. ఆయన మనసు మాత్రం చాలా మెత్తన అంటూ హరీశ్ వ్యాఖ్లలు చేశారు. ప్రజలకు సేవ చేసే బసవతారకం కేన్సర్ హాస్పిటల్ లాంటివాటికి ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు హరీశ్ రావు. బసవతారకం ఇండో అమెరికన్ ఆస్పత్రి 22 రెండేళ్లు సర్వీస్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని బసవతారకం కేన్సర్ హాస్పిటల్‌లో వార్సికోత్సవ వేడుకల నిర్వహించారు. ఈ వేడులకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఎంపీ నామా నాగేశ్వర్రావు హాజరయ్యారు. ముందుగా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక రేడియాలజీ పరికరాలను ప్రారంభించారు మంత్రి. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హరీశ్ రావు మాట్లాడారు.  ఎలాంటి లాభాపేక్ష లేకుండా పేదలకు సేవ చేస్తున్న అతి కొద్ది ఆస్పత్రుల్లో బసవతారకం ఆస్పత్రి ఒకటని హరీశ్ రావు పేర్కొన్నారు. పేదలకు ఎనలేని సేవ చేస్తున్న బసవతారకం ఆస్పత్రికి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.ఆస్పత్రి సిబ్బంది, మేనేజ్‌మెంట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. వైద్యం ఆరోగ్యంలో తెలంగాణ రాష్ట్రం టాప్ 3 ప్లేస్‌లో ఉందన్నారు. ప్రజలకు సేవ చేసే ఆస్పత్రులకు ప్రభుత్వ సహకారం తప్పక ఉంటుందన్నారు. బసవతారకం ఆస్పత్రి మేనేజింగ్ ట్రస్టీ ,ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై హరీశ్ రావు ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ చూడటానికి కరుకుగా కనిపించినా ఆయన మనసు మాత్రం మెత్తనా అంటూ... నవ్వులు పూయించారు మంత్రి.

  ఈ సందర్భంగా కేన్సర్ ఆస్పత్రి సాధించిన విజయల్ని బాలయ్య వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ కింద ఎక్కువమంది ట్రీట్ మెంట్ చేయించుకున్న ఆస్పత్రి ఇదేనన్నారు. వంద పడకల ఆస్పత్రిగా ప్రారంభమై.. ఇవాళ 600బెడ్స్ కెపాసిటీకి చేరిందన్నారు. అంతేకాదు.. కేన్సర్ ట్రీట్‌మెంట్‌లోనే దేశంలోనే సెకండ్ బెస్ట్ ఆస్పత్రిగా బసవతారకం నిలిచిందన్నారు. బసవతారకం ఆస్పత్రిని నందమూరి తారక రామారావు ప్రారంభించారన్నారు. తెలుగు అంటే అందరికీ ఎన్టీఆర్ పేరు గుర్తుకు వస్తుందన్నారు, అప్పటి ప్రధాని అటల్ బీహారి వాజ్ పేయి చేతులు మీదుగా ఆస్పత్రిని ప్రారంభించామన్నారు. మా తల్లి బసవతారకం పేరుమీదుగా ఈ ఆస్పత్రిని ప్రారంభించామని తెలిపారు. అప్పట్లో తమను ఆర్థికంగా ఆదుకున్న వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు బాలయ్య.
  Published by:Sultana Shaik
  First published:

  Tags: Balakrishna, Harish Rao, NTR

  తదుపరి వార్తలు