అందుకే ఉద్యోగుల జీతాల్లో కోత... మంత్రి హరీశ్ రావు

కరోనాకు మందు వచ్చే వరకు జాగ్రత్త వహించాలని హరీశ్ రావు అన్నారు. కరోనా వచ్చి బాధపడటానికి బదులుగా... వైరస్ రాక ముందే జాగ్రత్త పడటం మంచిదని ప్రజలకు అర్ధమయ్యేలా సవివరంగా వివరించారు.

కరోనా వల్ల ఏప్రిల్, మే నెలల్లో జీఎస్టీ కోల్పోయిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

  • Share this:
    దేశంలో అతి తక్కువ జీఎస్టీ పరిహారం పొందిన రాష్ట్రం తెలంగాణనే అని మంత్రి హరీశ్ రావు అన్నారు. 40వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ సమావేశంలో పాల్గొన్నారు. అన్ని రాష్ట్రాల కన్నా ఆదాయ వృద్ధిలో తెలంగాణ నెంబర్‌వన్ స్థానంలో ఉందని అన్నారు. కేంద్రం రాష్ట్రాలకు సహకారిగా ఉండాలని వ్యాఖ్యానించారు. కరోనా వల్ల ఏప్రిల్, మే నెలల్లో జీఎస్టీ కోల్పోయిందని తెలిపారు. ఆదాయం లేక ఉద్యోగుల జీతాల్లో కోత విధించామని తెలిపారు. జీఎస్టీ పరిహారం మొత్తం రూ. 3975 కోట్లను ఈ నెలలోనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 15వ ఆర్థిక సంఘం కూడా తెలంగాణకు నిధుల కోత పెట్టిందని హరీశ్ రావు గుర్తు చేశారు. కేంద్ర నిర్ణయాలు గుదిబండగా మారుతున్నాయని ఆరోపించారు.
    Published by:Kishore Akkaladevi
    First published: