బర్త్ డే వేడుకలు వద్దు... మంత్రి హరీశ్ రావు పిలుపు..

జూన్ 3న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఎలాంటి వేడుకలు జరపవద్దని మంత్రి హరీశ్ రావు సూచించారు.

news18-telugu
Updated: June 2, 2020, 10:10 PM IST
బర్త్ డే వేడుకలు వద్దు... మంత్రి హరీశ్ రావు పిలుపు..
హరీష్ రావు
  • Share this:
కరోనా కారణంగా ఈసారి తన పుట్టిన రోజు సందర్భంగా ఎవరినీ కలవలేకపోతున్నానని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఈ సందర్భంగా వేడుకలు జరుపుకోవడం, కలవడం మీకు నాకు శ్రేయస్కరం కాదని ఆయన అన్నారు. కరోనా వ్యాప్తి కారణంగా ఎలాంటి వేడుకలు కూడా జరపవద్దని కార్యకర్తలు, అభిమానులకు సూచించారు. తనను కలవడానికి రావొద్దని అన్నారు. తన పట్ల ప్రేమను చూపించిన వారందరికీ మరోసారి తలవంచి నమస్కరిస్తున్నన్నానని హరీశ్ రావు తెలిపారు. తనను ఆశీర్వదించడానికి వస్తామంటూ ఫోన్లు చేస్తున్న ప్రతీ ఒక్కరికి పేరుపేరునా మంత్రి హరీష్ రావు కృతజ్ఙతలు తెలిపారు. మీ అందరిని నిరాశపరుస్తున్నందుకు మన్నించాలని వ్యాఖ్యానించారు. జూన్ 3న తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఎలాంటి వేడుకలు చేయొద్దనే ఉద్దేశ్యంతో హరీశ్ రావు ఈ ప్రకటన విడుదల చేశారు.
First published: June 2, 2020, 10:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading