హోమ్ /వార్తలు /తెలంగాణ /

Harish rao : రెండు డోసుల తర్వాతే... ఆరు నెలలకు బూస్టర్ డోస్

Harish rao : రెండు డోసుల తర్వాతే... ఆరు నెలలకు బూస్టర్ డోస్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Harish rao : కరోనా కొత్త వేరియంట్‌పై మంత్రి హరీష్ రావు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ( Review on corona new variant ) విదేశాల నుండి వచ్చే వారిపై ప్రత్యేక ఫోకస్, వాక్సినేషన్ పూర్తితోపాటు ఆసుపత్రుల్లో వసతులపై ఆయన పలు సూచనలు చేశారు.

ఇంకా చదవండి ...

కరోనా కొత్త వేరియంట్‌తో మరోసారి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఇందులో భాగంగానే ఇండియాలో కూడా కొత్త వేరియంట్‌పై ప్రధాని మోదీ సైతం శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన పరిస్థితి నెలకొంది. ( Review on corona new variant ) ఈ క్రమంలోనే కొత్త వేరియంట్‌ ప్రభావంతోపాటు రాష్ట్రంలో కరోనా కట్టడిపై మంత్రి హరీష్ రావు నేడు హైదరాబాద్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో భాగంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో్లో కరోనా కట్టడికి హాస్పిటల్స్‌లో మౌళిక సదుపాయాలు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియ, ఇతర దేశాల నుంచి వచ్చే వారిపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టాలని సూచించారు. ( Review on corona new variant ) దీంతోపాటు విదేశాల నుండి వచ్చిన వారిని ట్రెసింగ్‌, టెస్టింగ్‌ తదితర అంశాలపై చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికే కరోనా కొత్త వేరియెంట్‌ వ్యాప్తిపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే.ఒమీక్రాన్‌ వేరియంట్‌పై పూర్తిస్థాయి రివ్యూచేశామని..ఒమీక్రాన్‌ వేరియంట్‌పై ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ మంత్రి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగిందని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

Kamareddy : కామారెడ్డిలో విషాదం.. ఒకేసారి ఇద్దరికి గుండెపోటు.. పేషంట్‌తో పాటు వైద్యుడు కూడా ప్రాణాలు విడిచాడు..


ఈ సంధర్భంగా అధికారులు పలు అంశాలు వివరించారు.. యూరోపియన్‌, హాంకాంగ్‌ సౌత్‌ ఆఫ్రికా నుండి వచ్చే వారికి ఎయిర్‌పోర్టులో ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అదే విధంగా .. విదేశీయులు రెండు డోసులు వ్యాక్సిన్‌ వేసుకున్నారా.. లేదా .. క్వారంటైన్‌లో పెట్టి టెస్టులు చేస్తున్నామని తెలిపారు.( Review on corona new variant ) ఇప్పటి వరకు కొత్త వేరియంట్‌ నమోదు కాలేదని, కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టాయని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు వివరించినట్టు చెప్పారు. . ప్రజలు ముందు జాగ్రత్తలు చేపట్టాలని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని ఆయన స్పష్టం చేశారు...

ప్రజలు వ్యాక్సిన్ పూర్తిగా వేసుకోవాలి.. రెండో డోస్ ఎవరు తీసుకోలేదో వారు తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. ( Review on corona new variant ) ఒమి క్రాన్ వేరియంట్ ప్రభావం దాని తీవ్రత ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మరో రెండు వారాలు పడుతుందన్నారు. ప్రజలు.. విధిగా భౌతిక దూరం పాటించాలి,మాస్కులు ధరించాలని తెలిపారు.

వ్యాక్సిన్ తీసుకున్న వారు ప్రాణాలు కోల్పోయే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు.కొత్త వేరియంట్‌ను ఎదుర్కొవడానికి ముందస్తు చర్యలు తీసుకున్నామని హెల్త్‌ డైరెక్టర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం.. 60 వేల వరకు బెడ్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. అదే విధంగా.. 10 వేల పడకలు పిల్లల కోసం అందుబాటులో ఉంచామని తెలిపారు.

( Review on corona new variant ) రెండు డోసులు వేసుకున్న 6 నెలల తరువాత బూస్టర్ డోస్ వేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడో డోస్‌పై విధి విధానాలు రూపొందిస్తోందని తెలిపారు. ఆ విధివిధానాలు వచ్చాక మూడో డోస్ గురించి చెప్తామని హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

First published:

Tags: Corona alert, Harish Rao

ఉత్తమ కథలు