Telangana: తగ్గిన సిటీ స్కాన్ ధర.. కరోనా కట్టడికి జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్ క‌మిటీల ఏర్పాటు..

విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి గంగుల కమలాకర్

Telangana: ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో క‌రోనా క‌ట్ట‌డికి రెండు టాస్క్‌ఫోర్స్ క‌మిటీలు ఏర్పాటు చేసిన‌ట్లు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ వెల్ల‌డించారు. మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ అధ్య‌క్ష‌త‌న ఈ రెండు క‌మిటీలు ఏర్ప‌డ్డాయి. 24 గంట‌ల పాటు వాట్సాప్‌లో అందుబాటులో ఉండే విధంగా గ్రూప్ ఏర్పాటు చేశారు.

 • Share this:
  కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ ఆసుపత్రులు మానవతాదృక్పతంతో పని చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ధరలకు - ప్రైవేటు లో వైద్యం అందించడంతో పాటు.. రేట్ల వివరాలు ప్రదర్శించాలని సూచించారు. సిటీ స్కాన్ రూ. 2 వేలకే అందించేందుకు డయాగ్నస్టిక్ కేంద్రాల నిర్వాహకులు అంగీకరించినట్లు తెలిపారు. స్కాన్ ఫిలిం కావాలంటే అద‌నంగా రూ. 200 చెల్లిస్తే స‌రిపోతుంద‌న్నారు. మంత్రి సూచ‌న‌ను యాజ‌మాన్యాలు అంగీక‌రించాయి. ఈ ధ‌ర‌లు త‌క్ష‌ణ‌మే అమ‌ల్లోకి వ‌స్తాయ‌న్నారు. కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. వైద్య సేవలకు సంబంధించి ప్రభుత్వం ఆదేశించిన ధరలకు అందించడంతో పాటు రేట్ల వివరాలను సూచిక బోర్డులో ప్రదర్శించాలన్నారు. కరోనా మహమ్మారి పేద, ధనిక భేదం తేడా లేకుండా అందరి ప్రాణాలతో చెలగాటమాడుతుందని ఆందోళనవ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోకి రెమిడీసీవర్ ఇంజేక్షన్లకు కొరత లేదన్నారు.

  ప్రైవేట్ ఆసుపత్రుల్లో రెమిడీసీవర్ ఎన్ని కొనుగోలు చేశారు ..ఎవరికీ ఇచ్చారనే వివరాలను నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసినట్లుగానే.. జిల్లాల స్థాయిలో కూడా టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. వాట్సాప్ గ్రూపులో ప్ర‌తి రోజు ప్ర‌భుత్వ‌, ప్రయివేటు ఆస్ప‌త్రుల్లో ఉన్న ఆక్సిజ‌న్ బెడ్ల వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌న్నారు. క‌రోనా రోగుల నుంచి ఎక్కువ డ‌బ్బులు వ‌సూలు చేసే ఆస్ప‌త్రుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.

  సమీక్ష సమావేశంలో మంత్రి తదితరులు


  క‌రోనా బాధితుల ప‌ట్ల ప్ర‌యివేటు డాక్ట‌ర్లు మాన‌వీయ కోణంతో ప‌ని చేయాల‌న్నారు. క‌రోనాను ఎదుర్కొనేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని, ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ స్ప‌ష్టం చేశారు. కరోనాతో ప్రజలు భయాందోళనలకు గురి కావద్దని.. తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఆసుపత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే టాస్క్ ఫోర్స్ దృష్టికి తీసుకు రావాలని.. వారి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
  Published by:Veera Babu
  First published: