హోమ్ /వార్తలు /తెలంగాణ /

Gangula kamalaker : పంట మార్చిన మంత్రి గంగుల.. ప్రత్యామ్నాయ పంటలపై రాష్ట్రం దృష్టి..

Gangula kamalaker : పంట మార్చిన మంత్రి గంగుల.. ప్రత్యామ్నాయ పంటలపై రాష్ట్రం దృష్టి..

Gangula kamalaker

Gangula kamalaker

Gangula kamalaker : యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం యూటర్న్ తీసుకోవడంతో రాష్ట్రంలో ప్రత్యామ్నయా పంటలపై రైతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. (alternative crops in telangana ) ఇందుకు అనుగుణంగానే మంత్రి గంగుల కమాలాకర్ తన వ్యవసాయ పోలంలో వరికి బదులు అయిల్ ఫాం పంటను వేసేందుకు సిద్దమయ్యారు.

ఇంకా చదవండి ...

యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రం యూటర్న్ తీసుకోవడంతో పాటు ప్రత్యమ్నాయ పంటల వైపు రైతులను మళ్లించాలని చెబుతోంది.( Focus on alternative crops in telangana ) దీంతో గత కొద్ది రోజులుగా యుద్దం ప్రకటించి టీఆర్ఎస్ పార్టీ చివరకు వరి పంటల మార్పుకే సంసిద్దత వ్యక్తం చేస్తోంది. కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ససేమీరా అనడంతో రాష్ట్ర అధికారులు, మంత్రులు సైతం పంటల మార్పిడిపై దృష్టి సారించారు. ( Focus on alternative crops in telangana ) ఈ క్రమంలోనే ముందుగా మంత్రులు తమ వ్యవసాయ భూముల్లో పంటమార్పిడికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో మంత్రి గంగుల కమాలాకర్ ముందుకు వచ్చారు.

యాసంగి వరిపై మొండి వైఖరి అవలంబిస్తున్న కేంద్ర బీజేపీ సర్కార్ విధానాలతో ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులు దృష్టి సారించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ( Focus on alternative crops in telangana ) అయితే రైతులను ఆ దిశగా అడుగులు వేయించేందుకు రాష్ట్ర నేతలు ముందుకు వస్తున్నారు.. ఇందుకోసం రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చొరవ చూపారు.. కరీంనగర్‌లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఇంతకాలం వరి పండించిన పొలాల్లో ఆయిల్ ఫామ్ సాగుకు సిద్దమౌతున్నారు. ఇందులో భాగంగానే నేడు వ్యవసాయ పనులకు మంత్రి గంగుల ( Minister gangula kamalaker ) స్వయంగా శ్రీకారం చుట్టారు, వ్యవసాయ అధికారుల సలహాల మేరకు ఆయిల్ ఫామ్ సాగుకు అనువుగా భూమిని సేధ్యం చేయించారు.( Focus on alternative crops in telangana ) గుంతలు తీసి మొక్కలు నాటడానికి అనువుగా ముందస్థుగా చేయాల్సిన పనులను స్వయంగా మంత్రి పర్యవేక్షించారు.

Revanth reddy : ధాన్యం కొనుగోలు చేయకపోతే... మోదీ, కేసీఆర్‌లకు నడిబజార్‌లో ఉరి ఖాయం..!


ఈ సంధర్భంగా రైతులకు పలు సూచనలు చేశారు...ఆయిల్ ఫామ్ సాగుకు తెలంగాణ నేలలు అనువైనవని నిర్దారణ కావడంతో ప్రభుత్వం ఇందుకోసం గతంనుండే కార్యాచరణ ప్రారంభించిందన్నారు. రైతులకు సబ్సిడీపై మొక్కలు అందించడం మొదలు కోత అనంతరం గెలలు తీసుకునే వరకూ కంపెనీలు అండగా ఉండి బాధ్యతలు నిర్వహిస్తుందన్నారు. ( Focus on alternative crops in telangana ) కోతుల బెడద లేకుండా, చీడపీడల బెడద తక్కువతో సాగయ్యే ఆయిల్ ఫామ్ చెట్లను తొమ్మిది మీటర్లకు ఒక మొక్క చొప్పున ఎకరాకు దాదాపు 57 మొక్కల ద్వారా 10టన్నుల దిగుబడి వస్తుందని, టన్నుకు 10వేల ధర వచ్చే అవకాశం ఉందని, అన్ని ఖర్చులు పోనూ ఎకరాకు 70 నుండి 80వేల ఆధాయాన్ని పంటకు వస్తుందన్నారు.

Aadilabad : చాలన్లు వేస్తున్నారని పోలీసుల ముందే..తన బైకుకు తానే నిప్పు.


మరోవైపు ప్రస్థుతం ప్రతీ ఏడాది లక్షకోట్ల రూపాయల విలువైన ఆయిల్‌ను ఇండోనేషియా, మలేషియా వంటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. నాలుగేళ్ళ నుండి దాదాపు 40 సంవత్సరాల వరకూ దిగుబడి ఇచ్చే ఆయిల్ ఫామ్ సాగులో మొదటి ఏడు ప్రభుత్వం 26వేలు అనంతరం 5వేల చొప్పున మూడేళ్లు సబ్సిడీని సైతం అందిస్తుందన్నారు. ( Focus on alternative crops in telangana ) దీనికితోడు అంతర పంటలుగా కూరగాయలు, పెసర, మినుము, కంది వంటి పప్పుదినుసుల సాగు ద్వారా రైతు అధనపు ఆదాయాన్ని సైతం అర్జించవచ్చని సూచించారు.

రైతులకు మేలు చేయడం కోసమే తెలంగాణ ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల్ని సాగు చేయాలని ప్రోత్సహిస్తుందని, ఆయిల్ ఫామ్ కోసం ఇప్పటికే సబ్సిడీలను ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసిన మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యామ్నాయ పంటల సాగు చేయాలని పిలుపునిచ్చారు.

First published:

Tags: Gangula kamalakar, Hyderabad

ఉత్తమ కథలు