మంత్రి గంగులపై బీజేపీ ఫిర్యాదు... కోడ్ ఉల్లంఘించారని ఆరోపణ

పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రెస్ మీట్ పెట్టి... తాను కారు గుర్తుకు ఓటు వేశానని, ప్రజలంతా కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రేరేపించేలా మంత్రి గంగుల మాట్లాడటం బాధ్యతారాహిత్యం అని బాస సత్యనారాయణ రావు మండిపడ్డారు.

news18-telugu
Updated: January 24, 2020, 9:39 PM IST
మంత్రి గంగులపై బీజేపీ ఫిర్యాదు... కోడ్ ఉల్లంఘించారని ఆరోపణ
(ఫైల్ చిత్రం)
  • Share this:
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు శుక్రవారం జరిగిన పోలింగ్ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు అన్నారు. 42వ డివిజన్ లోని ట్రినిటీ బాలికల జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన తర్వాత బయటకు వచ్చిన గంగుల కమలాకర్... తాను కారు గుర్తుకు ఓటు వేశానని ప్రకటించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంకకు ఫిర్యాదు చేశామని చెప్పారు. పోలింగ్ కేంద్రం సమీపంలో ప్రెస్ మీట్ పెట్టి... తాను కారు గుర్తుకు ఓటు వేశానని, ప్రజలంతా కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రేరేపించేలా  మంత్రి గంగుల మాట్లాడటం బాధ్యతారాహిత్యం అని బాస సత్యనారాయణ రావు మండిపడ్డారు.

గంగుల వ్యాఖ్యలపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. మంత్రి వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఆధారాలను కూడా ఫిర్యాదుతో జతపరిచినట్లు బాస సత్యనారాయణ రావు చెప్పారు.

First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు