KTR: 'కేటీఆర్‌ని సీఎం చేస్తే మేమంతా..' మంత్రి గంగుల కమలాకర్ కీలక వ్యాఖ్యలు

కేసీఆర్‌తో కేటీఆర్(ఫైల్ ఫోటో)

ఇటీవల టీఆర్ఎస్ సీనయిర్ నేత, మంత్రి ఈటల రాజేందర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి అని వ్యాఖ్యానించారు. బుధవారం మరో మంత్రి శ్రీనివాస్ యాదవ్ సైతం అదే రకంగా స్పందించారు.

  • Share this:
    మంత్రి కేటీఆర్ తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టబోతున్నారని రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ త్వరలోనే పదవి నుంచి తప్పుకుని తన కుమారుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. కేసీఆర్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారని.. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఫిబ్రవరిలోనే కేటీఆర్‌ సీఎం అవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతున్నాయి. తాజాగా మంత్రి గంగుల కమలాకర్ కూడా దీనిపై మాట్లాడారు. కేటీఆర్ సమర్థవంతమైన నాయకుడని.. తండ్రికి దగ్గ తనయుడు అని కొనియాడారు. ఆయన్న ముఖ్యమంత్రి చేస్తే.. అందరం ఒకే మాటపై ఉండి మద్దతు తెలుపుతామని అన్నారు.

    '" ముఖ్యమంత్రి ఎవరు అనేది మా పార్టీ అంతర్గత విషయం. మా పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారు. ముఖ్యమంత్రిని డిసైడ్ చేసేది మా బాస్ కేసీఆర్. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా మేం శిరసావహిస్తాం. ఒకవేళ కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ భావిస్తే మేం అందరం ఒకే మాటపై ఉండి మద్దతిస్తాం. కేటీఆర్ సమర్థవంతమైన నాయకుడు. తండ్రికి దగ్గ తనయుడు. ఐటీ మంత్రిగా పొన్నాల ఉన్నప్పుడు ఏదైనా కంపెనీ వచ్చింది. కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు 24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 15 లక్షల మంది ఉద్యోగ అవకాశాలు లభించాయి. గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చాయంటే ఆ ఘనత కేటీఆర్‌దే. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారా? లేదా ? అన్నది బీజేపీకి అవసరం. ఇది మా పార్టీ అంతర్గత విషయం.'' అని గంగుల కమలాకర్ అన్నారు.
    ఇటీవల టీఆర్ఎస్ సీనయిర్ నేత, మంత్రి ఈటల రాజేందర్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటి అని వ్యాఖ్యానించారు. బుధవారం మరో మంత్రి శ్రీనివాస్ యాదవ్ సైతం అదే రకంగా స్పందించారు. కేటీఆర్ సీఎం అయితే తప్పేంది అని ప్రశ్నించారు. దీనిపై సీఎం కేసీఆర్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఇలా వరుసగా మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలు.. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. కాగా, కేటీఆర్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మంత్రి హరీష్ రావుకు రాష్ట్ర పార్టీ బాధ్యతలను కట్టబెట్టతారని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే.. మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
    Published by:Shiva Kumar Addula
    First published: