హోమ్ /వార్తలు /తెలంగాణ /

Gangula kamalakar : బాధ్యత బండి సంజయ్ తీసుకుంటారా.. లేక ఈటలనా...?

Gangula kamalakar : బాధ్యత బండి సంజయ్ తీసుకుంటారా.. లేక ఈటలనా...?

Gangula kamalakar : స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. అయితే కరీంనగర్ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అపవిత్ర పొత్తుకు తెరలేపారని, ఎన్నికల్లో వచ్చిన ఫలితాలకు ఈటలా లేక బండి సంజయ్ భాద్యత వహిస్తారా అంటూ మంత్రి గంగుల కమలాకర్ సవాల్ విసిరారు.

ఇంకా చదవండి ...

  ఎమ్మెల్సీ ఎన్నికల్లో ( mlc elections ) టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడంతో ఆపార్టీ నేతలు ఎన్నికల్లో గెలుపుకోసం కృషినవారు జోష్ మీద ఉన్నారు. గెలుపుతో హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత ఊరట లభించింది. ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ పక్కా వ్యుహాంతో ముందుకు సాగింది. తమ పార్టీ సభ్యులను గీత దాటకుండా ముందు జాగ్రత్త వహించింది. నామినేషన్ వేసిన రోజునే అభ్యర్థులతో సహా సభ్యులను సైతం క్యాంపులు తీసుకుని వెళ్లారు. దీంతో బీజేజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు పలికిన సర్ధార్ రవీందర్ సింగ్‌కు కనీసం ఓటింగ్ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఇద్దరు అభ్యర్థులను ఆ పార్టీ గెలిపించుకుంది.

  ఈ సంధర్భంగా మంత్రి గంగుల కమాలాకర్ Gangula kamalakar మాట్లాడుతూ..బీజేపీ కాంగ్రెస్ ‌పార్టీలపై మండిపడ్డారు. ఇద్దరు అభ్యర్థులు కూడా మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలవడం టీఆర్ఎస్ భలానికి సంకేతమన్నారు. గత హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీలు అపవిత్ర పొత్తుతునే ఆ ఎన్నికల్లో విజయం సాధించారని అన్నారు. ఇక ప్రస్తుతం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని చెప్పారు.

  Khammam mlc Review : ఖమ్మంలో క్రాస్‌ ఓటింగ్‌.. గట్టెక్కిన తెరాస.. క్రాస్‌ ఓటింగ్‌పై సీఎం కేసీఆర్‌ ఆరా..

  ఈ క్రమంలోనే మొత్తం 1324 ఓట్లలో 870 టీఆర్ఎస్ జెండా మీద గెలిచామని, మరో 116 మంది కేసీఆర్ గారి పాలన పట్ల ఆకర్షితులై పార్టీలో జాయిన్ అయ్యారని, మా మొత్తం బలం 986, స్పష్టమైన ఆధిక్యం ఉంది కాబట్టే మేం ఎన్నికలకు వెళ్లామన్నారు. కేవలం 324 ఓట్లు మాత్రమే ప్రతిపక్షాలు, ఇండిపెండెంట్లవని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు బలం లేవని తెలిసి పోటీ పెట్టమన్నారని, ఇండిపెండెంట్లు సైతం పోటీలో ఉండమన్నారు, కానీ కడుపుమంటతో, అక్రమ కలయిక, అపవిత్ర పొత్తుతో అభ్యర్థి పోటీలో నిలిచాడని దుయ్యబట్టారు.

  MLC elections :ఎమ్మెల్సీ ఎన్నికల్లో సవాళ్లను నిలబెట్టుకున్న ఆ... నేతలు.. ?

  బీజేపీ ఎమ్మెల్యే బహిరంగంగా కాంగ్రెస్ పార్టీతో కూడిన ఉమ్మడి అభ్యర్థికి మద్దతిస్తామనడం రాజకీయాల్లో నీచ చర్యగా అభివర్ణించారు. ఇక ఇరు పార్టీల నేతలు కుమ్మక్కు కావడం ద్వారానే ఇండిపెండెంట్ అభ్యర్థికి 232 ఓట్లు వచ్చాయని చెప్పారు. వాస్తవానికి ఆయన్ను సమర్ధించిన బీజేపికి కేవలం 105 ఓట్లు మాత్రమే ఉన్నాయని మిగతావి కాంగ్రెస్ , ఇండిపెండెంట్లు ఓట్లని చెప్పారు. దీంతో రెండు పార్టీలు కుమ్మక్కయ్యారనేదికి ఇది నిదర్శమని మంత్రి విమర్శించారు.

  Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

  First published:

  Tags: Karimnagar, Mlc elections, Telangana

  ఉత్తమ కథలు