తెలంగాణ (Telangana)రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandisanjay)చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా కరీంనగర్(Karimnagar)హిందూ ఏక్తాయాత్ర(Hindu Ekta Yatra)లో ఆయన హిందువులకు అండగా ఉంటాం..సంపూర్ణ హిందూ సమాజాన్ని నిర్మిస్తామనే వ్యాఖ్యలు చేస్తూనే ముస్లిం(Muslims)లకు వ్యతిరేకంగా మతపరమైన వ్యాఖ్యలు చేయడం కొత్త వివాదానికి దారి తీసేలా కనిపిస్తోంది. గతంలో తెలంగాణలో వేలాది ఆలయాలను ధ్వంసం చేశారన్న బండి సంజయ్..రాష్ట్రంలోని మసీదులన్ని తొవ్వితే శివలింగాలు బయటపడతాయన్నారు. కాదని నిరూపించమని ఎంఐఎం ఎంపీ, మజ్లీస్ నేత అసదుద్దీన్ ఓవైసీ( Asaduddin Owaisi)కి సవాల్ విసిరారు. మసీదులు తొవ్వితే శవాలొస్తే మీవి..శి వలింగాలు వస్తే మావంటూ ఏక్తాయాత్రకు భారీగా తరలివచ్చిన హిందూవులను చూసిన ఉత్తేజంలో కామెంట్స్ చేశారు.రాత్రి జరిగిన హిందూ ఏక్తా యాత్ర లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) కౌంటర్ ఇచ్చారు.
‘‘బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ని క్లియర్ గా ఒక్కటి అడుగుతున్నాను. తెలంగాణ వచ్చిన తరువాత ఎక్కడ కూడా విధ్వంసం జరగలేదు. రాష్ట్రం రాకముందు మీలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతోనే కర్ప్యూలు జరిగాయి. తెలంగాణ లో లా అండ్ అర్డర్ బ్రహ్మండంగా మెంటైన్ చేస్తున్నారు. ప్రస్తుతం మత కల్లోలాలు ఎక్కడ లేవు. గతంలొ మత కల్లోలాల తో అభివృద్ధి కి నోచుకొలేదు. హిందువులు, ముస్లిం లు కలిసి జీవిస్తున్నారు. గడ్డపార వట్టి తవ్వుతానన్నావు గదా కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి రూపంలో గడ్డపార పట్టి తవ్వు. హిందు ముస్లిం ల టెంపుళ్లని కూలగొట్టడం అనేది విధ్వంసాలకి దారి తిసే అవకాశం ఉంది. గుజరాత్లో మత విద్వేషాల కారణంగా ఏ కంపెనీలు రావడం లేదు. బండి సంజయ్ తన వ్యాఖ్యలని వెనక్కి తీసుకొవాలి.
ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం బాధాకరం..
మీ వ్యాఖ్యలు తెలంగాణ లొ కాదు, బీజేపీ పాలిత రాష్ట్రంలో ఈ వ్యాఖ్యలు చేయండి. కెసీఆర్ (KCR) ప్రభుత్వం ఉన్నది శాంతి భద్రతల కి విఘాతం కలుగనియ్యం.మా ప్రభుత్వం అభివృద్ధి మీద,మీది మత విధ్వేషాలని రెచ్చగొట్టడం మీద దృష్టి పెట్టారు.మేము అభివృద్ధి మీద ఓట్లు అడుగుతే,మీరు మతాలని చూసి ఓట్లు అడుగుతున్నారు. ఎంపీ హొదా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం బాధాకరం, మీ వ్యాఖ్యలని వెనక్కి తీసుకోండి..ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టి కరీంనగర్ ను అల్లా కల్లోలం చేయవద్దని.. బండి సంజయ్ కి మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మతకలహాలకు ఆజ్యం పోయడం మానుకుని..
బండి సంజయ్ మతకలహాలకు ఆజ్యం పోయడం మానుకుని... మేము అభివృద్ధి చేసి ఓట్లు అడిగితే... బండి సంజయ్ మతం ప్రాతిపాదికన ఓట్లు అడిగేందుకు యత్నిస్తున్నారు.. పరమతాలను గౌరవించడం నేర్చుకోవాలి.. రాజకీయ లబ్ధి కోసం బండి సంజయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం..ఇంకో మతం గురించి మాట్లాడడం ఏ మతం ఒప్పుకోదు....
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bandi sanjay, Gangula kamalakar