KCR Birthday | సూర్యాపేట జిల్లాలో మూసీ రహదారికి కేసీఆర్ పేరిట నామకరణం...

సూర్యాపేట జిల్లా టేకుమట్ల మూసీ రహదారికి కేసీఆర్ రహదారిగా జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సోమవారం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నామకరణం చేశారు.

news18-telugu
Updated: February 17, 2020, 11:12 PM IST
KCR Birthday | సూర్యాపేట జిల్లాలో మూసీ రహదారికి కేసీఆర్ పేరిట నామకరణం...
ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి
  • Share this:
సూర్యాపేట జిల్లా టేకుమట్ల మూసీ రహదారికి కేసీఆర్ రహదారిగా జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సోమవారం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నామకరణం చేశారు. అనంతరం రహదారిలో ఇరు వైపులా 6,600 మొక్కలు నాటారు. సూర్యా పేటలోని జగదీశ్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన బర్త్‌డే కేక్‌‌ చేసి, రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. కేసీఆర్ 66వ జన్మదినాన్ని పురస్కరించుకుని గులాబీ శ్రేణులు 66మంది రక్తదానం చేశారు. సూర్యపేట మండలం నెల్లికల్లు గ్రామ శివారులో ఎస్ఆర్ఎస్పీ కాలువల మీద కాలేశ్వరం జిల్లాల మధ్యన రైతులు, పెన్‌పహాడ్ మండలం రావి చెరువు వద్ద ఆయకట్టు రైతాంగం, గిరిజన తండాల్లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.

First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు