news18-telugu
Updated: January 14, 2021, 11:59 AM IST
మంత్రి ఈటల రాజేందర్ (పైల్ ఫోటో)
దేశ ప్రజలంతా కరోనా భయం నుంచి కాస్త భయట పడి.. వాక్సిన్ వచ్చిన సంతోషంలో ఉన్నారు. ఈ సమయంలో తెలంగాణకు సైతం వాక్సిన్ చేరింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో కవిడ్ వ్యాక్సినేషన్ పంపిణీ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి కరోనా టీకా గాంధీ ఆస్పత్రిలో పని చేసే కర్మచారి అంటే పారిశుధ్య కార్మికుడికి ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రానికి బుధవారం 20 వేల కొవాగ్జిన్ డోసులు వచ్చినట్లు మంత్రి వివరించారు. తొలి రోజు 139 సెంటర్లలో ఒక్కో సెంటర్ కు 30 మందికి చొప్పున వ్యాక్సిన్ అందించనున్నట్లు మంత్రి చెప్పారు. మొదటగా గవర్నమెంట్ హెల్త్ కేర్ వర్కర్లకు, అనంతరం ప్రైవేటు హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించనున్నట్లు మంత్రి వివరించారు.
తర్వాతి రోజు 50, అనంతరం 100 ఇలా అంచెల వారీగా వాక్సిన్ డోసులను పెంచనున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పటి వరకు 3 లక్షల 30 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు మంత్రి తెలిపారు. కొద్దిసేట్లో కరోనా వ్యాక్సిన్ కోఠి నుంచి రాష్ట్రంలోని జిల్లాలకు తరలనున్నట్లు మంత్రి చెప్పారు. ఇన్సులేటర్ వాహనాలు ఎస్కార్ట్ వాహనాలతో వెళ్లనున్నాయని వివరించారు. అనుమతి, సంతకం తీసుకున్నాకే వ్యాక్సిన్ డోసులు అందజేయనున్నట్లు వివరించారు.
ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా కరోనా టీకాల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొదట కోవిషీల్డ్ టీకాలు ఇప్పటికే చేరుకోగా.. ప్రస్తుతం కొవాగ్జిన్ టీకాలను అన్ని ప్రాంతాలకు చేర్చుతున్నారు. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ కంపెనీ నుంచి కొవాగ్జిన్ టీకాల తొలి బ్యాచ్ బుధవారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నాయి. అక్కడి నుంచి మూడు బాక్స్‌లను వాటిని హర్యానాలోని కురుక్షేత్రకు తరలించారు. హైదరాబాద్ నుంచి మిగతా ప్రాంతాలకు కూడా కోవాగ్జిన్ వ్యాక్సిన్లను తరలిస్తున్నారు. 16 నుంచి వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ఏర్పాట్లలో మునిగిపోయాయి.
Published by:
Nikhil Kumar S
First published:
January 14, 2021, 10:31 AM IST