• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • MINISTER ETELA RAJENDER SAYS WE REQUEST CENTRAL GOVERNMENT FOR CORONA VACCINATION TO JOURNALISTS SU

మీడియా సిబ్బందికి కరోనా వ్యాక్సిన్.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఈటల రాజేందర్

మీడియా సిబ్బందికి కరోనా వ్యాక్సిన్.. కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఈటల రాజేందర్

మంత్రి ఈటల రాజేందర్ (పైల్ ఫోటో)

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముందుగా తొలి దశలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు సహా ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకాలు వేస్తున్నారు.

  • Share this:
    దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముందుగా తొలి దశలో డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు సహా ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు టీకాలు వేస్తున్నారు. వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు. తెలంగాణలో ప్రభుత్వ వైద్య సిబ్బందికి క‌రోనా వ్యాక్సిన్ వేయ‌డం పూర్తికావడంతో.. ప్రైవేటు వైద్య సిబ్బందికి కూడా టీకా ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. ఇక, కరోనా కాలంలో కూడా సేవలు అందించిన మీడియా సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ అందించే అంశంపై తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యాలు చేసారు. ఆదివారం శామీర్‌పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్‌పోలియో కార్యక్రామన్ని మంత్రి ఈటల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని ప్రజలకు సూచించారు.

    రాష్ట్రంలో 38,31,907 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నామని చెప్పారు. దీనికోసం 23,331 పోలియో బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. మరో 877 మొబైల్ టీమ్‌లను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో ఐదేండ్ల లోపు ప్రతి ఒక్క చిన్నారికి కూడా వ్యాక్సిన్ అందించడమే వైద్య, ఆరోగ్య శాఖ లక్ష్యమని చెప్పారు.

    పల్స్‌ పోలియో ముగిసిన వెంటనే కరోనా వ్యాక్సిన్‌ కూడా వేస్తామని మంత్రి ఈటల చెప్పారు. మీడియా సిబ్బందికి కూడా కరోనా టీకా అందించాలని శనివారమే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని వెల్లడించారు. ఈ విషయంలో కేంద్రం సానుకూలంగా స్పదిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. కేరళ, తమిళనాడు తర్వాత ఆరోగ్యానికి అత్యంత ప్రాధన్యత ఇచ్చే మూడో రాష్ట్రంగా తెలంగాణ ఉందన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published:

    అగ్ర కథనాలు