• HOME
 • »
 • NEWS
 • »
 • TELANGANA
 • »
 • MINISTER ETELA RAJENDER COMMENTS IN TELANGANA ASSEMBLY OVER BASTHI DAWAKHANA SU

Etela Rajender: బస్తీ దవాఖానాల విస్తరణపై మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు.. త్వరలోనే ఆ నగరాల్లో కూడా..!

Etela Rajender: బస్తీ దవాఖానాల విస్తరణపై మంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు.. త్వరలోనే ఆ నగరాల్లో కూడా..!

మంత్రి ఈటల రాజేందర్ (పైల్ ఫోటో)

హైద‌రాబాద్ న‌గ‌రంలో 225 బ‌స్తీ ద‌వాఖానాలు అందుబాటులో ఉన్నాయ‌ని మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో తెలిపారు. తెలంగాణ‌లోని ఇత‌ర న‌గ‌రాల‌కు బ‌స్తీ ద‌వాఖానాల‌ను విస్త‌రించే ప్ర‌తిపాద‌న ప‌రిశీల‌న‌లో ఉంద‌న్నారు.

 • Share this:
  తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు కొనసాగుతున్నాయి. బుధవారం ప్రశ్నోత్తరాల సందర్బంగా బస్తీ దవాఖానాలకు సంబంధించి సభ్యులు ప్రశ్నలు అడిగిన ప్రశ్నలకు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సమాధానమిచ్చారు. హైద‌రాబాద్ న‌గ‌రంలో 225 బ‌స్తీ ద‌వాఖానాలు అందుబాటులో ఉన్నాయ‌ని మంత్రి ఈటల తెలిపారు. తెలంగాణ‌లోని ఇత‌ర పెద్ద న‌గ‌రాల‌కు బ‌స్తీ ద‌వాఖానాల‌ను విస్త‌రించే ప్ర‌తిపాద‌న ప‌రిశీల‌న‌లో ఉంద‌న్నారు. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం తదితర కార్పొరేషన్లలోనూ అవసరమై చోట్ల బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ 350 బ‌స్తీ ద‌వాఖానాల ఏర్పాటుకు అనుమతించారని తెలిపారు. ఈ క్ర‌మంలో 10 వేల జ‌నాభా ఉన్న బ‌స్తీల్లో బ‌స్తీ ద‌వాఖానాలు ఏర్పాటు చేశామని చెప్పారు.

  అర్బన్ పీహెచ్‌సీలు అందుబాటులో లేని ప్రాంతాలకు మూడు కిలోమీటర్ల దూరంలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినట్టు మంత్రి ఈటల తెలిపారు. అర్బన్ పీహెచ్‌సీల మాదిరిగానే బస్తీ దవాఖానాలు పనిచేస్తున్నాయని అన్నారు. బస్తీ దవాఖానాలో ఒక డాక్ట‌ర్, ఒక స్టాఫ్ న‌ర్సుతో పాటు అటెండ‌ర్ ఉంటారని.. ఉద‌యం 9 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు ఇవి సేవలు అందిస్తాయని చెప్పారు. బస్తీ దవాఖానాలకు కావాల్సిన మందుల కోసం నెల‌కు రూ. 20 వేలు, ఇతర ఖర్చుల కోసం రూ. 10 వేలు సమకూర్చుస్తున్నట్టు తెలిపారు.

  అన్ని బ‌స్తీ ద‌వాఖానాల‌ను తెలంగాణ డ‌యాగ్నోస్టిక్ సెంట‌ర్‌తో అనుసంధానం చేశామ‌న్నారు. బ‌స్తీ ద‌వాఖానాలు వ‌చ్చిన త‌ర్వాత పేద‌ల‌కు నాణ్య‌మైన వైద్యం అందుతుంద‌రని మంత్రి సభలో వెల్లడించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో బస్తీ దవాఖానాలు విజయవంతమైనందున.. వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో పేద ప్రజలకు అవసరమైన చోట బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు.
  Published by:Sumanth Kanukula
  First published:

  అగ్ర కథనాలు