తెలంగాణలో లాక్‌డౌన్‌పై స్పష్టతనిచ్చిన మంత్రి ఈటల.. ఆక్సిజన్ లేకుండా కరోనా రోగులు చనిపోవడం దేశానికే అవమానం.. కేంద్రంపై తీవ్ర విమర్శలు..

మంత్రి ఈటల రాజేందర్ (పైల్ ఫోటో)

కరోనా సమయంలో ఆక్సిజన్‌ లేక రోగులు చనిపోవడం దేశానికే అవమానకరమని తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. అలాగే కేంద్రం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

 • Share this:
  తెలంగాణలో లాక్‌డౌన్ విధించనున్నట్టుగా జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ రాజేందర్ స్పందించారు. తెలంగాణ‌లో లాక్‌డౌన్ పెట్టే ఆలోచ‌న లేద‌ని ఆయన స్పష్టం చేశారు. రేపటి నుంచి 19 జిల్లా డ‌యాగ్నొస్టిక్ హ‌బ్‌లు ప్రారంభిస్తామ‌న్నారు. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న వారికి జిల్లా డ‌యాగ్నొస్టిక్ కేంద్రాల్లో ర‌క్త ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. హోం ఐసోలేష‌న్‌లో ఉన్న వారు మూడు, నాలుగు రోజుల‌కు ఒక‌సారి ర‌క్త ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించారు. రాష్ట్రంలో మెడిసిన్, ఆక్సిజన్ అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా సేకండ్ వేవ్ ఉధృతిని అంచనా వేయడంతో కేంద్రం విఫలమైందని మంత్రి ఈటల రాజేందర్ విమర్శించారు. కోవిడ్ విషయంలో రాష్ట్రాలకు కేంద్రం చేసిందేమీ లేదని మండిపడ్డారు.

  క‌రోనా రోగులు స‌రిపడా ఆక్సిజ‌న్ లేక చ‌నిపోవ‌డం దేశానికి అవ‌మాన‌క‌రం అని మంత్రి ఈట‌ల ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు విశ్వాసం కోల్పోయే అవ‌కాశం ఉంటుంది. అన్నీ కేంద్రం చేతుల్లో పెట్టుకొని రాష్ట్రాలపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అవ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్‌ను కేంద్రం యుద్ధ ప్ర‌తిపాదిక‌న స‌ర‌ఫ‌రా చేయాల‌న్నారు. కేంద్రం చేయాల్సిన తప్పులన్నీ చేసి రాష్ట్రాలను నిందించడం సరికాదని మంత్రి ఈటల రాజేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరోనా కేసులు, మరణాలపై తప్పుడు వార్తలు ఇస్తున్నారని విమర్శలు చేశారు.

  TSPSC చైర్మన్‌ నియామకంపై హైకోర్టు కీలక ఆదేశాలు.. అలా చేయకుంటే టీఎస్‌పీఎస్సీని మూసివేయాలని ఘాటు వ్యాఖ్యలు..

  KCR Covid Report: మిశ్రమంగా సీఎం కేసీఆర్ కరోనా రిపోర్టులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటే..

  రాష్ట్రంలో మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ సాధ్యం కాదని అన్నారు. కేంద్రం కేటాయించే వ్యాక్సిన్ల‌ను బ‌ట్టి రాష్ర్టంలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతుంద‌న్నారు. టీకాలు వ‌చ్చే ప‌రిస్థితిని బ‌ట్టి ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తామ‌న్నారు. 600 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కావాలని కేంద్రాన్ని అడిగాం.కానీ, 306 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ను కేటాయించారని చెప్పారు.
  Published by:Sumanth Kanukula
  First published: