అందుకే అలా చేశాం... మధుసూదన్ అంత్యక్రియలపై స్పందించిన మంత్రి ఈటల

మధుసూదన్ మృతి గురించి పోలీసులకు చెప్పామని... ఆయన భార్యకు తెలిస్తే షాక్‌లోకి వెళ్లే ప్రమాదముందని చెప్పలేదని మంత్రి ఈటల రాజేందర్ వివరించారు.

news18-telugu
Updated: May 21, 2020, 1:23 PM IST
అందుకే అలా చేశాం... మధుసూదన్ అంత్యక్రియలపై స్పందించిన మంత్రి ఈటల
ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)
  • Share this:
గాంధీ ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ కారణంగా చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలను నిర్వహించడంపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. మొదట్లో కోవిడ్‌తో చనిపోయినవారిని దహనం చేయడానికి అంతా భయపడ్డారని ఆయన తెలిపారు. మధుసూదన్ తండ్రి ఈశ్వరయ్య ఆస్పత్రిలో చేరిన 24 గంట్లోనే చనిపోయారని... ఆయన కుమారుడు అదే రోజు ఆస్పత్రిలో చేరి ఒకటవ తేదీన చనిపోయారని అన్నారు. మధుసూదన్ మృతి గురించి పోలీసులకు చెప్పామని... ఆయన భార్యకు తెలిస్తే షాక్‌లోకి వెళ్లే ప్రమాదముందని చెప్పలేదని వివరించారు. అప్పుడు డెడ్‌బాడీని ఫ్రీజర్‌లో పెట్టే పరిస్థితి లేదని... మధుసూదన్ మరణవార్త తట్టుకోలేరని వాళ్ల సన్నిహితులే చెప్పారని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆ సమయంలో కుటుంబమంతా ఆస్పత్రిలోనే ఉండటంతో... ప్రభుత్వం తరపున అంత్యక్రియలు మేమే చేశామని అన్నారు. వారి ఆరోగ్యం కుదుటపడ్డ తరువాత ఇలా మాట్లాడటం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు.
Published by: Kishore Akkaladevi
First published: May 21, 2020, 1:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading