వారికి కరోనా వస్తే ప్రత్యేక వార్డులో చికిత్స... మంత్రి ఈటల ప్రకటన

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వారికి అందిస్తున్న చికిత్సపై మంత్రి సమీక్షించారు.

news18-telugu
Updated: June 2, 2020, 9:43 PM IST
వారికి కరోనా వస్తే ప్రత్యేక వార్డులో చికిత్స... మంత్రి ఈటల ప్రకటన
ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)
  • Share this:
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి కరోనా పాజిటివ్ వస్తే... ప్రస్తుతం అందరి పేషంట్లతో కలిపి చికిత్స అందిస్తున్నారు. కానీ ఇక మీదట వేరే వార్డ్ ఏర్పాటు చేసి ప్రత్యేకంగా చికిత్స అందించాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అధికారులను ఆదేశించారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వారికి అందిస్తున్న చికిత్సపై మంత్రి సమీక్షించారు. అన్నీ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ పైప్ లైన్లు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. సిబ్బంది పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. క్షేత్ర స్థాయి నుండి టర్శరీ కేర్ వరకు ఎవరూ కూడా సెలవులు పెట్టవద్దని అన్నారు. అందరూ విధులకు హాజరయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

కరోనాతో యుద్ధంలో వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ముందు వరుసలో ఉండి పోరాడుతున్నారని మంత్రి ఈటల ప్రశంసించారు. వారి ఆరోగ్య రక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో వైద్య సిబ్బందికి ప్రత్యేక విధివిధానాలు రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వారి ఆరోగ్య పరిరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గ్రామ స్థాయిలో ఉన్న సిబ్బంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని... హాస్పిటల్స్‌లో ఉన్న సిబ్బంది ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలో ఇప్పటికే అన్ని పాటిస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

Published by: Kishore Akkaladevi
First published: June 2, 2020, 9:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading