డాక్టర్లు కిట్లు లేకే కరోనా వచ్చిందనడం తప్పుడు ప్రచారమని వ్యాఖ్యానించారు తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్. కొన్ని ఆపరేషన్లు వాయిదా వేయవచ్చు కానీ... డెలివరీలు ఆపలేమని అన్నారు. ప్రాణాలు ఫణంగా పెట్టి డాక్టర్లు డ్యూటీ చేస్తున్నారని తెలిపారు. కరోనా పేషెంట్లు ఎంత మంది ఉన్నా ట్రీట్మెంట్ చేస్తున్నామన్న ఈటల రాజేందర్... గాంధీలో చాలామందికి నయం చేసి పంపామని స్పష్టం చేశారు. లాక్డౌన్ సడలింపుల అనంతరం కేసులు పెరిగాయని... కరోనా కేసులపై రెండు రోజులుగా చర్చించామని చెప్పారు. ఇతర ప్రాంతాలవారు, వలస కూలీల ద్వారా కేసులు పెరిగాయని వివరించారు.
టెస్టుల విషయంలో ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నామని మరోసారి క్లారిటీ ఇచ్చారు. కోర్టుల్లో పిల్లు వేసి ప్రభుత్వాన్ని పని చేయకుండా చేసే పనులు సరికావని హితవు పలికారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టే విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని... ప్రజలు కూడా ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని మంత్రి ఈటల రాజేందర్ సూచించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.