హోమ్ /వార్తలు /తెలంగాణ /

ఆ విషయం బాధ కలిగించింది... కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోంది.. మంత్రి ఈటల ఫైర్..

ఆ విషయం బాధ కలిగించింది... కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోంది.. మంత్రి ఈటల ఫైర్..

ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)

ఈటల రాజేందర్(ఫైల్ ఫోటో)

కరోనా వ్యాక్సిన్‌ మాదిరిగానే రెమిడెసివిర్‌ మెడిసిన్‌‌ను కూడా వారి అధీనంలోనే ఉండేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడం బాధాకరమని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.

  క‌రోనా టీకాల పంపిణీతో పాటు రెమిడెసివ‌ర్ విష‌యంలో తెలంగాణ ప‌ట్ల కేంద్రం వివ‌క్ష చూపుతోంద‌ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. గుజరాత్ తో పోలిస్తే తెలంగాణకు కేటాయించినదెంతో కేంద్రం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో కరోనా పరిస్థితులపై మంత్రి ఈటల గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి 4లక్షల రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు ఆర్డర్‌ పెడితే కేవలం 21,550 మాత్రమే ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సరికాదని అన్నారు. కరోనా వ్యాక్సిన్‌ మాదిరిగానే రెమిడెసివిర్‌ మెడిసిన్‌‌ను కూడా వారి అధీనంలోనే ఉండేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై కేంద్ర మంత్రి హర్షవర్దన్‌తో మాట్లాడినట్టు చెప్పారు. కేంద్రానికి త‌మ నిర‌స‌న‌ను వ్య‌క్తం చేస్తున్నాం అని తెలిపారు. రాజ‌కీయాల‌ను ప‌క్క‌న పెట్టి.. క‌ష్ట‌కాలంలో ఆదుకోవాల్సిన అవ‌స‌రం కేంద్రంపై ఉంద‌న్నారు.

  హైదరాబాద్‌లో కేవలం తెలంగాణ ప్రాంత పెషేంట్ల మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక.. రాష్ట్రాలకు చెందిన వారు కూడా చికిత్స పొందుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉత్పత్తయ్యే రెమిడెసివిర్ తమకే కేటాయించాలని కేంద్ర లేఖ రాస్తామని చెప్పారు. కరోనా కారణంగా పరిస్థితులు దారుణంగా మారాయని అన్నారు. తెలంగాణ ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదని చెప్పారు. కొందరు ప్రైవేట్ హాస్పిటల్స్ వారు డబ్బులు చెల్లించలేని వారిని గాంధీ హాస్పిటల్‌కు పంపుతున్నారని అన్నారు. ఆక్సిజన్ బ్లాక్‌లో సరఫరా చేసినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్సిజన్‌పై ఐఏఎస్‌ల బృందం నిరంతరం పర్యవేక్షణ చేస్తోందన్నారు. గాంధీలో కరోనా పేషెంట్లకు అవసరమైన వైద్యం అందుతోందని తెలిపారు. ప్రతి ఒక్కరు స్వీయ రక్షణ పాటించాలని కోరారు.

  ఇక, తెలంగాణలో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా రాష్ట్రంలో 5,567 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,73,468కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ గురువారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న 1,02,335 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్టుగా తెలిపింది. రాష్ట్రంలో కరోనాతో నిన్న 23 మంది మృతిచెందారు. కరోనా బారి నుంచి నిన్న 2,251 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 49,781కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 989 కేసులు నమోదయ్యాయి.

  Published by:Sumanth Kanukula
  First published:

  Tags: Covid vaccine, Etela rajender, Telangana

  ఉత్తమ కథలు