హోమ్ /వార్తలు /తెలంగాణ /

ktr : మంత్రి కేటీఆర్‌కు షాక్...కాన్వాయ్‌కి అడ్డంగా వెళ్లిన బీజేవైఎం..

ktr : మంత్రి కేటీఆర్‌కు షాక్...కాన్వాయ్‌కి అడ్డంగా వెళ్లిన బీజేవైఎం..

ktr : మంత్రి కేటీఆర్‌కు షాక్...

ktr : మంత్రి కేటీఆర్‌కు షాక్...

ktr : మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకుని బీజేవైఎం కార్యకర్తలు షాక్ ఇచ్చారు.. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ పరిధి తుక్కుగూడ మున్సిపాలిటీలోని ఈ-సిటీ సోలార్ సెల్ 750 డబ్యూ కంపెనీ ప్రారంభానికి వెళ్లిన మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను బీజేవైఎమ్ నేతలు అడ్డుకున్నారు.

ఇంకా చదవండి ...

  ప్రారంభోత్సవానికి వెళుతున్న మంత్రి కాన్వాయ్‌ని మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.హుజురాబాద్‌ దళితులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులందరికి దళిత బంధును అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.. దీంతోపాటుకాన్వాయ్ అడ్డుకున్న వారిలో బీజేవైఎమ్ జిల్లా అధ్యక్షుడు యాదిష్, రాకేష్, పలువురు నాయకులు ఉన్నారు.


  కాగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేవైఎం కార్యకర్తలు ఉద్యోగాల భర్తికి ఆందోళన బాట పట్టారు.. మంత్రుల కాన్వాయ్‌లను అడ్డుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే రంగారెడ్డి జిల్లా ఇటివల పర్యటిస్తున్న మంత్రి దయాకర్ రావుతోపాటు సబితా ఇంద్రారెడ్డిల కాన్వాయ్‌లను కూడా అడ్డుకున్నారు. మరోవైపు కేటీఆర్ కాన్వాయ్‌ని కూడా ఇప్పటికే రెండు సార్లు బీజేవైఎం కార్యకర్తలు అడ్డుకోవడం గమనార్హం

  Published by:yveerash yveerash
  First published:

  Tags: Ktr covoy, Rangareddy

  ఉత్తమ కథలు