హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana Minister: ఓటమి భయంతోనే ఇలా చేశారు.. కేంద్రంపై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..

Telangana Minister: ఓటమి భయంతోనే ఇలా చేశారు.. కేంద్రంపై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు..

మాట్లాడుతున్న మంత్రి

మాట్లాడుతున్న మంత్రి

Telangana Minister: కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం  రైతు వ్యతిరేక ప్రభుత్వమని, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నదని తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

ఇంకా చదవండి ...

(K.Lenin,News18,Adilabad)

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం(Government)  రైతు వ్యతిరేక ప్రభుత్వమని, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నదని తెలంగాణ(Telangana) రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నూతన వ్యవసాయిక చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన 750 మది రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని పేర్కొన్నారు.  సాగు చట్టాల రద్దుపై పార్లమెంట్ లో చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేసినా..  చర్చ జరపకుండానే నిమిషాల వ్యవధిలో బిల్లుకు ఆమోదం తెలిపారని బీజేపీ ప్రభుత్వ తీరును మంత్రి  తప్పుపట్టారు.  నిర్మల్  జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

Comedian Raghu Karumanchi: మద్యం అమ్ముతున్న కమెడియన్ రఘు.. కారణం ఏంటో తెలుసా..


కేంద్ర ప్రభుత్వ రైతు విధానాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  సాగు చట్టాలను నిరసిస్తూ పోరాటంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో ప్రతి కుటుంబానికి మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారని గుర్తుచేశారు.  750 మంది రైతు కుటుంబాలకు 22.50 కోట్ల రూపాయలు అందజేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.  బీజేపీ నాయకుల అసత్య ప్రచారాన్ని నమ్మి  మోసపోవద్దని రైతులను కోరారు.  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు యాసంగిలో  రైతులు  వరి ధాన్యం పండించ వద్దని విజ్ఞప్తి చేశారు.

Bigg Boss 5 Telugu Anchor Ravi Re Entry: యాంకర్ రవి రీ ఎంట్రీ..? బిగ్ బాస్ నిర్వాహకుల ఆలోచన ఇదే..


వరికి బదులుగా ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను  వేయాలని సూచించారు.  వేసవిలో తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలేదన్నారు. ఒకవైపు యాసంగిలో వరి ధాన్యం కోనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే,  రాష్ట్రంలోని బీజేపీ నేతలు  మాత్రం వరి ధాన్యం కోనుగోలు చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు.  తెలంగాణ వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు.

Telangana Rythubandhu: తెలంగాణ రైతులకు శుభవార్త.. ఆ రోజే ‘రైతుబంధు’ నిధులు జమ.. వివరాలిలా..


కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని ఆరోపించారు. రైతుల సంక్షేమం  కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం యేడాదికి రెండు పంటలకు పెట్టుబడిసాయం, బీమా సౌకర్యం  కల్పిస్తోందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని,  ఆయన చెప్పే మాటలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు.

First published:

Tags: Adilabad, Telangana

ఉత్తమ కథలు