అసదుద్దీన్ ఒవైసీకి కరోనా టెస్ట్... రిపోర్టును చూశాక ఏమన్నారంటే...

ఇప్పుడిప్పుడే రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. మరి అసదుద్దీన్ ఒవైసీ ఎందుకు టెస్ట్ చేయించుకున్నారు?

news18-telugu
Updated: July 11, 2020, 2:20 PM IST
అసదుద్దీన్ ఒవైసీకి కరోనా టెస్ట్... రిపోర్టును చూశాక ఏమన్నారంటే...
అసదుద్దీన్ ఒవైసీకి కరోనా టెస్ట్... రిపోర్టును చూశాక ఏమన్నారంటే...
  • Share this:
హైదరాబాద్ ఎంపీ, MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చాలా మంది లాగే... కరోనా వైరస్ శాంపిల్ టెస్ట్ చేయించుకున్నారు. కరోనాను నిర్ధారించే ర్యాపిడ్ యాంటీజెన్, RT-PCR టెస్టులను చార్మినార్ దగ్గరున్న నిజామియా తిబ్బీ హాస్పిటల్‌లో చేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రజలకు తెలిపారు. RT-PCR టెస్టులో ఫలితం ఆలస్యంగా వస్తుంది గానీ... యాంటీజెన్‌లో అరగంటలోనే రిపోర్ట్ వస్తుంది. అసదుద్దీన్‌కి ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులో నెగటివ్ వచ్చిందని తెలిసింది. హైదరాబాద్ సౌత్‌లో 30 సెంటర్లలో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారని ఎంపీ ట్విట్టర్ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలిపారు.


అసదుద్దీన్‌కి ఎలాంటి అనారోగ్య సమస్యలూ లేవు. కరోనా లక్షణాలు కూడా లేవు. ఐతే... ఈమధ్య రాజకీయ నేతలకు ఎక్కువగా కరోనా సోకుతోంది కాబట్టి... ఎందుకైనా మంచిదని ఆయన కూడా టెస్టు చేయించుకున్నారు. తన లాగా అందరూ టెస్టులు చేయించుకోవాలనీ, భయపడాల్సిన పని లేదని ఆయన తెలిపారు. యాంటీజెన్ టెస్టులో తనకు నెగటివ్ రావడంతో చాలా రిలాక్స్ ఫీల్ అయ్యాయన్న అసదుద్దీన్... హైదరాబాద్‌లో టెస్టులు పెంచాలని.. ఒక్కో హాస్పిటల్‌లో రోజుకు 1000 చొప్పున టెస్టులు చెయ్యాలని కోరుతున్నారు.

తెలంగాణలో కొత్తగా 1278 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 32,224కి పెరిగింది. ఇక 8 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 339కి చేరింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 762 కొత్త కరోనా కేసులు వచ్చాయి. ఆ తర్వాత రంగారెడ్డి (171), మేడ్చల్ (85), సంగారెడ్డి (36), కామారెడ్డి (23), మెదక్ (22), ఖమ్మం (18), నల్లగొండ (32), ఆదిలాబాద్ 14, సూర్యాపేట (14) కరోనా కేసులు నమోదయ్యాయి. మరికొన్ని జిల్లాల్లో 10 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. సిటీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ICMR రూల్స్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులు చేస్తోంది. ఈ టెస్టుల్లో కరోనా పాజిటివ్ వస్తే... ఇక RT-PCR టెస్ట్ అవసరం లేదు. అదే... కరోనా లక్షణాలు ఉండి కూడా... యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వస్తే... డాక్టర్లు తప్పనిసరిగా RT-PCR టెస్ట్ చెయ్యాల్సి ఉంటుంది.
Published by: Krishna Kumar N
First published: July 11, 2020, 2:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading