హోమ్ /వార్తలు /తెలంగాణ /

Asaduddin Owaisi : Z కేటగిరి సెక్యూరిటి వద్దన్న ఒవైసీ.. కారణం ఇదేనట..

Asaduddin Owaisi : Z కేటగిరి సెక్యూరిటి వద్దన్న ఒవైసీ.. కారణం ఇదేనట..

అసదుద్దీన్ ఒవైసీ (File)

అసదుద్దీన్ ఒవైసీ (File)

Asaduddin Owaisi : కేంద్రం కేటాయించిన జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అసవరం లేదని, దాన్ని తిరస్కరిస్తున్నట్లు ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ తెలిపారు. దేశ ప్రజలకు భద్రత లభిస్తే తనకు లభించినట్లే అని అన్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో తనపై కాల్పులు జరిగిన తర్వాత ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై దాడి జరిగిన అంశాన్ని లోక్‌సభ దృష్టికి తీసుకువచ్చిన ఆయన ఆ తర్వాత తనకు కేటాయించిన జడ్‌ కేటాగిరి భద్రత అవసరం లేదని, తాను చావుకు భయపడే వ్యక్తిని కాదని చెప్పారు. అయితే తనపై కాల్పులు జరిపిన నిందితులపై కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.

యూపీ ఎన్నికల నేపథ్యంలో మేరఠ్‌ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఢిల్లీ వెళ్తుండగా ఒవైసీ కారుపై కాల్పులు జరిగిన విషయం సంచలనంగా మారిన విషయం తెలిసందే... దీంతో అసదుద్దీన్‌కు తక్షణమే సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో కూడిన జడ్‌ కేటగిరీ భద్రతను కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, తనకు జడ్‌ కేటగిరీ భద్రత అక్కర్లేదన్న అసద్‌.. అందరిలాగే తాను 'ఏ కేటగిరీ' పౌరుడిగానే ఉండాలనుకుంటున్నట్టు తెలిపారు.

Khammam : ఆ మాజీ మంత్రికి బుజ్జగింపులు.. తెరాస అధినేత కేసీఆర్ వ్యూహం ఏంటో..?

అయితే కాల్పులు జరిపిన వారిని చూసి తాను ఏమాత్రం భయపడనన్నారు. దాడి చేసిన వారికి యూపీ యువకులు బ్యాలెట్‌ ద్వారా సమాధానం ఇస్తారని.. యూపీలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తనపై కాల్పులు జరిపిన వారిపై యూఏపీఏ చట్టం ఎందుకు ప్రయోగించరని ప్రశ్నించారు. దేశంలో పేదలు, మైనార్టీలకు భద్రత ఉంటే తనకూ ఉన్నట్టేనని చెప్పారు. దేశంలోని పేదలు బాగుంటేనే తానూ బాగుంటానన్నారు. తనపై కాల్పులు జరిపిన వారిని శిక్షించి.. తనకు న్యాయం చేయాలని కోరారు.

Murder : పెళ్లింట విషాదం... పెళ్లి కోసం వచ్చిన మేనమామపై గొడ్డలితో దాడి చేసి చంపిన తండ్రి...

కాగా ఒవైసీ కారుపై కాల్పుల ఘటన నేపథ్యంలో ఆయనకు 'జడ్' కేటగిరీ భద్రత కల్పిస్తూ శుక్రవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. జడ్‌ కేటగిరీ కింద 22 మంది భద్రతా సిబ్బందితోపాటు ఒక ఎస్కార్ట్‌ వాహనాన్ని కేటాయించనుంది. వీరిలో నలుగురు నుంచి ఆరుగురు ఎన్‌ఎస్‌జీ కమాండోలు, పోలీసు సిబ్బంది కూడా ఉంటారు.

First published:

Tags: Asaduddin Owaisi, MIM

ఉత్తమ కథలు