హోమ్ /వార్తలు /తెలంగాణ /

Asaduddin Owaisi : పాతబస్తి రౌడీలు పద్దతి మార్చుకోండి.. లేదంటే బహిష్కరణ.. స్ట్రాంగ్ వార్నింగ్

Asaduddin Owaisi : పాతబస్తి రౌడీలు పద్దతి మార్చుకోండి.. లేదంటే బహిష్కరణ.. స్ట్రాంగ్ వార్నింగ్

అసదుద్దీన్ ఓవైసీ(ఫైల్ ఫొటో)

అసదుద్దీన్ ఓవైసీ(ఫైల్ ఫొటో)

Asaduddin Owaisi : ఇటివల హైదరాబాద్ పాతబస్తిలో జరుగుతున్న నేరాలపై ఎంపీ అసదుద్దిన్ ఓవైసి స్పందించారు. పాతబస్తిలో రౌడీలు రెచ్చిపోతున్నారని..ఇక ముందు ఎవరైనా పాతబస్తివాసులను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


పాతబస్తి (old city ) అంటే ఓ రకమైన కల్చర్.. నగరంతో పాటు దేశవ్యాప్తంగా జరిగే పలు అసాంఘీక

కార్యకలపాల మూలలు నగరంలోని పాతబస్తిలో ఉంటాయి. అయితే ఇలా గ్యాంగ్‌లు , రౌడియిజం పెద్ద ఎత్తున కొనసాగుతుంటాయి. దీంతో వాళ్లు బయటి వ్యక్తులనే టార్గెట్ చేయకుండా పాతబస్తిలోని వారిని కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో ఇటివల హత్యలు, ఎక్కువగా జరుగుతున్నాయి. రెండు గ్యాంగుల మధ్య ఎక్కువ అవుతుండడంతో ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ సీరియస్ అయ్యారు. నగరంలోని యువకులు గ్యాంగ్‌లను మెయింటెన్ చేస్తూ రౌడీయిజానికి దిగితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.. తప్పుడు దారిలో ప్రయాణిస్తున్న వారిని మత పెద్దలు, ప్రజలు సామాజిక బహిష్కరణ చేయాలని ఆయన సూచించారు.

హైదరాబాద్‌లోని (Hyderabad ) ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ.. (Asaduddin

Owaisi) పాతబస్తీలో రోజు రోజుకీ పెరుగుతున్న హత్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పాతబస్తీ మత పెద్దలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. పాతబస్తీలో ప్రతి చిన్న విషయానికి ఇరువర్గాలు కొట్టుకుంటూ హత్యలు ( murders ) చేసుకుంటున్నారని, హత్యలు విపరీతంగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ప్రజల్లో మార్పు కోసం తల్లిదండ్రులతో ( parents ) పాటు మతపెద్దలు కూడా ముందుకు రావాలని అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు.

ఇది చదవండి : భార్యపై అనుమానం, బర్రెను వెతుకుదామంటూ తీసుకువెళ్లి.. బురదలో తొక్కాడు.. !

గ్యాంగ్‌లు మెయింటెన్‌ చేసే యువకులు అమాయకులని వేధించి, హత్యకు పాల్పడితే అలాంటి వ్యక్తులను ఎట్టిపరిస్థితుల్లో వదలని హెచ్చరించారు. ఇక ఇలాంటి వారిని గుర్తించి వారిలో మానసికంగా మార్పు కోసం ప్రయత్నించాలని, వినకపోతే.. పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.

ఇది చదవండి :  అంతుచిక్కని ఓటర్ నాడి.. ఏ పార్టీ మీటింగ్‌కైనా.. పోటెత్తుతున్న ప్రజలు

ఒకవేళ పోలీసులు ( police ) కౌన్సిలింగ్ ఇచ్చినా.. వారిలో మార్పు రాకపోతే.. సామాజిక బహిష్కరణ

చేయాలని మత పెద్దలకు అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు. వీరిపై తాను చాలా కఠినంగా వ్యవహరిస్తానని చెప్పారు.వాళ్ల ఓట్లు కూడా తమ పార్టీకి అవసరం లేదని, ప్రజలు వారిని సామాజిక బహిష్కరణ చేయాలని పిలుపునిచ్చారు.

First published:

Tags: Asaduddin Owaisi, Hyderabad

ఉత్తమ కథలు